పశ్చిమగోదావరి

జనవరికి కొత్త కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-సంక్రాంతిలోగా అందజేత
-చంద్రన్న కానుకకు అర్హత
ఏలూరు, డిసెంబర్ 18: ఎన్నిరకాల సందేహాలు, అనుమానాలు తలెత్తినా వాటిని పటాపంచలు చేస్తూ పెద్దపండుగకు ప్రభుత్వం రాష్ట్రప్రజలకు భారీకానుకగా కొత్త రేషన్‌కార్డులను అందజేసేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గత కొనే్నళ్లుగా రేషన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న వేలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. దీంతోపాటు రేషన్‌కార్డుల ద్వారా వచ్చే ఇతర ప్రయోజనాలు కూడా అందే వీలు లభించింది. మొత్తంమీద చూస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈస్దాయిలో కార్డుల పంపిణి జరగటం విశేషంగానే చెప్పుకోవాలి. తాజా పరిస్థితుల్లో వడపోతలు, పరిశీలన అనంతరం జిల్లాలో 98,963 మందికి కొత్త రేషన్‌కార్డులను అందించనున్నారు. ఈభారీ కార్యక్రమం జనవరి మొదటివారంలో ప్రారంభం కానుంది. సంక్రాంతి నాటికి ఈకార్యక్రమాన్ని పూర్తి చేసేవిధంగా కసరత్తు చేస్తున్నారు. ఈ 98,963మందికి కార్డులు ఇవ్వాలని పూర్తిస్దాయిలో నిర్ణయించటంతో ఈ జాబితాలో ఉన్నవారికి క్రిస్మస్ కానుకతోపాటు సంక్రాంతి కానుకగా చంద్రన్న కానుకను కూడా అందజేయనున్నారు. అయితే ఈ కార్డులపై బియ్యం వంటి నిత్యావసర సరుకులను మాత్రం ఫిబ్రవరి నుంచి అందజేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 2వ తేదీ వరకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని మిగిలినపోయినవారిలో అర్హులను ఫిబ్రవరి నెలలో గుర్తించేందుకు రెండవదశ ప్రక్రియ ప్రారంభం కానుంది.