రాష్ట్రీయం

బడ్జెట్‌లో ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రానికి రైల్వే మంత్రి హామీ * తిరుపతి -షిర్డీ రైలు ప్రారంభం

తిరుపతి, డిసెంబర్ 26: కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. శనివారం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి -సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రకు కేంద్ర రైల్వే బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు స్వచ్ఛ భారత్, అభియాన్ పథకాల కింద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధులకన్నా రెండింతలు ఎక్కువగా ఖర్చు చేశామన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మరిన్ని ఎక్కువ నిధులను కేటాయిస్తామన్నారు. 400 స్టేషన్లను ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో 200కు పైగా స్టేషన్లను ఆదర్శ రైల్వేస్టేషన్ పథకం జాబితాలో చేర్చామని, అందులో తిరుపతి కూడా ఉందన్నారు. తితిదే సహకారంతో స్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. రద్దీ మార్గాల్లో సామర్థ్యం పెంపు, గేజ్ మార్పిడి, సింగిల్ లైన్లు డబుల్‌లైన్లుగా మార్చడం, విద్యుద్దీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న సమయంలోనే భోజనాన్ని కూడా ఆర్డర్ చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు.
** తిరుపతిలో శనివారం తిరుపతి- షిర్డీ రైలు ప్రారంభిస్తున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు **