రాష్ట్రీయం

జోరుగా న్యూఇయర్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గట్టి భద్రత
టాంక్‌బండ్, ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత
రిసార్ట్స్, స్టార్ హోటళ్లలో సందడే సందడి

హైదరాబాద్, డిసెంబర్ 31: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర స్వాగతం పలుకుతూ గురువారం రాత్రి నగర యువతలో హల్‌చల్ చేసింది. జంటనగరాల్లోని స్టార్ హోటళ్లు, శివారులోని రిసార్ట్స్‌లో యువతీయువకులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ హోటళ్లలో సెలబ్రటీలు ఆటపాటలతో అలరించారు. సైబరాబాద్ పరిధిలోని పబ్‌లు, రిసార్ట్సుల్లోనూ యువత విందువినోదాలతో ఉర్రూతలూగారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఫ్యాషన్ షోలు, క్యాట్ వాక్‌లూ నడిచాయి. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సిఐఎస్‌ఎప్, సిఆర్‌పిఎఫ్, ఆర్టీఐఎ పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డును గురువారం రాత్రి 8.00గంటలనుంచే మూసివేశారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు అంక్షలు విధించారు. ఈవెంట్ నిర్వాహకులు సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వకూడదని సూచించారు. రాత్రి 12.00 గంటల తర్వాత తెరచి ఉంచిన వైన్ షాపులపై పోలీసులు దాడులు చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారిని మినహా టాంక్‌బండ్, ఔటర్ రింగ్‌రోడ్డుపై ఎవరినీ అనుమతించలేదు. రాత్రి పనె్నండు తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.