జాతీయ వార్తలు

హైదరాబాద్ చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. ఇప్పటికే నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ పూర్తవ్వగా మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచారు. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన యువ వైద్యురాలు దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నలుగురు నిందితులు పారిపోవటానికి ప్రయత్నించగా వీరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. దిశను సజీవ దహనం చేసిన చటాన్‌పల్లి ప్రాంతానికి కేవలం 300 మీటర్ల దూరంలో వీరు హతమవ్వటం జరిగింది. దిశ హత్యోదోంతం నిందితుల ఎన్ కౌంటర్ చేయడంపై ఒకవైపు హర్షాతీరేఖాలు వ్యక్తం అవుతుండగా.. మరోవైపు అదే సందర్భంలో ఈ ఘటనపై నిరసనలు..ఖండించేవారు లేకపోలేదు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలు తెలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపాలని నిర్ణయించిన విషయం విదితమే.
ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎం జరిగిందన్నదానిపై నివేదికను తయారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఆర్‌సీ బృందానికి సహకరించేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక బృందాన్ని సంఘటనా ప్రదేశంలో సిద్ధంగా ఉంచారు.