తెలంగాణ

12 రోజుల కస్టడీ కోరిన ఎన్‌ఐఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో అరెస్టు చేసిన అయిదుగురు ఐసిస్ సానుభూతి పరులను కనీసం 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేసిన 11 మందిలో ఆరుగురిని సాక్షులుగా మార్చి, మిగతా అయిదుగురిని చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద కార్యకలాపాలపైన, పేలుడు పదార్థాల కొనుగోలుపైన పూర్తిస్థాయిలో సమాచారం సేకరించేందుకు నిందితులను 12 రోజుల పాటు తమకు అప్పగించాలని ఎన్‌ఐఎ తరఫున హాజరైన న్యాయవాది కోరారు. ఈ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాక కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.