బిజినెస్

రూ. 40 వేల కోట్లతో ఎన్‌ఐఐఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌలికాభివృద్ధికి ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
పాలక మండలి చైర్మన్‌గా ఆర్థిక మంత్రి జైట్లీ
వచ్చే నెలాఖర్లోగా సిఇఒ నియామకం
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలతో జాతీయ పెట్టుబడులు, వౌలిక నిధి (ఎన్‌ఐఐఎఫ్)ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య కార్యనిర్వహణా అధికారి (సిఇఒ)ని వచ్చే నెల జనవరి ఆఖర్లోగో నియమిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులకు తెలిపారు. ఎన్‌ఐఐఎఫ్ పాలక మండలి తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా, సింగపూర్, బ్రిటన్, యుఎఇ దేశాలకు చెందిన పలు సావరిన్, పెన్షన్ ఫండ్స్ నిర్వహణా సంస్థలు ఎన్‌ఐఐఎఫ్‌లో భాగస్వాములమవుతామని ఆసక్తి కనబరుస్తున్నట్లు జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. వివిధ దశల్లో ఎన్‌ఐఐఎఫ్‌కు సహకరిస్తామంటున్నాయని కూడా పేర్కొన్నారు. ‘రాబోయే కొద్ది వారాల్లో ఎన్‌ఐఐఎఫ్ సిఇఒ నియామక ప్రక్రియ ముగుస్తుందన్న ఆశాభావం మాకుంది.’ అని జైట్లీ అన్నారు. సిఇఒ అనే్వషణ, ఎంపిక కోసం ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి (డిఇఎ) శక్తికాంత దాస్ నాయకత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ కమిటీ జనవరి నెలాఖర్లో సిఇఒను ప్రకటిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఎన్‌ఐఐఎఫ్‌లో కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతుండగా, మరో 20,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ మదుపరుల నుంచి పెట్టుబడిగా వస్తాయని భావిస్తున్నారు. ఈ నిధిలో ప్రభుత్వ వాటా 49 శాతాన్ని మించదు. ఇదిలావుంటే ఎన్‌ఐఐఎఫ్ ట్రస్టీ లిమిటెడ్‌కు ఆరు నెలలపాటు పెట్టుబడుల సలహాదారుగా ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సిఎల్), ఏడాదిపాటు సలహాదారుగా ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ లిమిటెడ్‌లను నియమించారు. ఇక పెట్టుబడులకు సంబంధించి ఎన్‌ఐఐఎఫ్ నిధి తీసుకునే నిర్ణయాలు, వాటి ఫలితాలపై వచ్చే ఏడాది మార్చిలో మరోసారి ఎన్‌ఐఐఎఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమవుతుందని జైట్లీ తెలిపారు. ఎన్‌ఐఐఎఫ్ ఏర్పాటును మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా ఆమోదించగా, దీన్ని కేటగిరి-2 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఎఐఎఫ్)గా సోమవారం సెబీ పేర్కొంది. నిధుల కొరతతో స్తంభించిన ప్రాజెక్టులతోపాటు గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్‌లలో ఎన్‌ఐఐఎఫ్ పెట్టుబడులను పెట్టనుంది. ఈ ఏడాది జూలైలోనే ఎన్‌ఐఐఎఫ్ ఏర్పాటును కేబినెట్ ఆమోదించగా, తాజా పాలక మండలి సమావేశంలో నిధుల కొరతతో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చింది. వీటి అభివృద్ధికి ఎన్‌ఐఐఎఫ్ నిధులను వినియోగించే వీలుంది. కాగా, ఎన్‌ఐఐఎఫ్ పాలక మండలి చైర్మన్‌గా జైట్లీ వ్యవహరించనున్నారు. సభ్యులుగా శక్తికాంత దాస్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్‌తోపాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తదితరులున్నారు. పాలక మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా పాల్గొన్నారు. (చిత్రం) మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఐఐఎఫ్ పాలక మండలి తొలి సమావేశం