రాష్ట్రీయం

12.5వేల ఎకరాల్లో నిమ్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలలో 3.5 వేల ఎకరాల భూసేకరణ
సమీక్షలో పరిశ్రమల మంత్రి జూపల్లి

హైదరాబాద్, డిసెంబర్ 28: తయారీ పరిశ్రమల కేంద్రం నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై దృష్టి సారించింది. నెల రోజుల్లో 3500 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. భూసేకరణ కోసం ల్యాండ్ అక్విజేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, యూనిట్ ఆధ్వర్యంలో త్వరితగతిన భూసేకరణ జరపనున్నట్టు తెలిపారు. దేశంలో తొలి నిమ్జ్ తెలంగాణలో ప్రారంభమవుతోంది. కేంద్రం మంజూరు చేసిన నిమ్జ్‌లో 40వేల కోట్ల పెట్టుబడులు పెడతారు. లక్షమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. నిమ్జ్‌కోసం మొత్తం 12.5వేల ఎకరాల భూమి సేకరించనున్నట్టు తెలిపారు. జనవరి 2016 చివరి నాటికి 3500 ఎకరాల భూమి సేకరించనున్నట్టు చెప్పారు. నిమ్జ్ ట్రాక్టర్లు, యంత్రాల వంటి పలు తయారీ పరిశ్రమల కేంద్రంగా ఉంటుంది. గతంలోనే నిమ్జ్‌ను మంజూరు చేయగా, ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. సోమవారం జరిగిన టిఎస్‌ఐఐసి సమీక్షా సమావేశంలో నిమ్జ్ కోసం భూసేకరణపై సమీక్ష జరిపారు. భూసేకరణ వేగవంతం చేయాలని, దాని కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నత్తనడకలో ఫార్మాసిటీ పనులు
ఫార్మాసిటీకి సంబంధించిన పనులు నత్తనడక సాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, పనులు వేగంగా సాగడం లేదన్నారు. దీనికి సంబంధించి గ్లోబల్ టెండర్లు పిలువనున్నట్టు చెప్పారు. మార్చి 2016నాటికి టెండర్లు ఖరారు కావాలన్నారు. ఇప్పటి వరకు ఫార్మాసిటీకి 800 ఎకరాల భూమి అప్పగించినట్టు చెప్పారు. తహిల్దార్లు, ఎంఆర్‌ఓలు, ఆర్డీవోలతో వెంటనే సమావేశాన్ని నిర్వహించి ఆరునెలల కాలంలో చేసిన పనిపై నివేదిక తీసుకోవాలని కృష్ణారావు ఆదేశించారు. ఫార్మాసిటీ భూసేకరణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిమ్జ్ మెదక్, ఫార్మాసిటీల భూసేకరణపై ఈనెల 31న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేసి, యువతకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. పరిశ్రలకు అవసరమైనవారు సిద్ధంగా ఉండేలా శిక్షణ ఉండాలన్నారు. ఫుడ్ పార్క్‌లపై సమీక్ష జరిపారు. జాతీయ రహదారులకు ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే పరిశ్రమల కారిడార్ ఉండాలన్నారు. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరుసగా పర్యటించి పరిశ్రమల పురోగతి పరిశీలించనున్నట్టు జూపల్లి తెలిపారు.