ఆంధ్రప్రదేశ్‌

అడుగడుగునా నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మభూమిని బహిష్కరించిన వైకాపా నేతలు

కడప, జనవరి 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని తొలిరోజు శనివారం కడప జిల్లాలోని పలుప్రాంతాల్లో వైకాపా ఎంపిలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. కొన్నిచోట్ల వైకాపా నేతలు గ్రామసభలకు హాజరై అధికారులను సమస్యలపై నిలదీశారు. 2వ రోజున జరిగే జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, అధికారపార్టీ నేతలను సమస్యలపై నిలదీయాలని వైకాపా అధిష్టానం యోచిస్తున్నది. జన్మభూమి తొలిరోజు కార్యక్రమంలో పులివెందుల, రైల్వేకోడూరు, కడప ప్రాంతాల్లో వైకాపా నేతలు హాజరై ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, జన్మభూమి కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కెవి రమణ, ఇతర అధికారులు యథావిధిగా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు. రైల్వేకోడూరులో వైకాపా ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బి.చంగల్రాయులు తదితరులు గ్రామసభకు హాజరై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 18నెలల పాలనలో పర్యటనలు, సమావేశాలు, సభలు, వీడియోకాన్ఫరెన్స్‌లకే పరిమితమయ్యారే తప్ప ఎన్నికలు హామీలు నిలబెట్టుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు.
వర్షాలతో రైల్వేకోడూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు కోలుకోలేని దెబ్బతినగా, ఇప్పటి వరకు బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ధ్వజమెత్తారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి రాజంపేటలో మాట్లాడుతూ వైకాపా నేతలంతా జన్మభూమి కార్యక్రమానికి హాజరై అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. పులివెందులలో పలు గ్రామసభల్లో వైకాపా నేతలు అధికారుల ఎదుట నిరసనలు తెలిపి గ్రామసభలను బహిష్కరించారు. రాజంపేట అసెంబ్లీ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాల్లో వైకాపా ప్రజాప్రతినిధులే ఉండటంతో వారిలో చాలామంది గ్రామసభలకు హాజరుకాలేదు. ఒకవేళ సమస్యలపై గళమెత్తితే తమపై కేసులు బనాయిస్తారని భావించి కొంతమంది దూరంగా ఉన్నారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, అధికారపార్టీ నేతలను నిలదీసి తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తాలని వైకాపా అధినేత జగన్ ఆదేశించినట్లు తెలిసింది. రైతుల పంట రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు రద్దు , కాల్‌మనీ, ప్రభుత్వ చౌక దుకాణాల డీలర్ షిప్‌లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాలు, జన్మభూమి కమిటీలు తదితరాలపై ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, వీటిపై పోరాడతామని వైకాపా నేతలు చెబుతున్నారు. దీంతో కడపజిల్లా జన్మభూమి నిర్వహణ అధికారులకు కత్తిమీద సాముగా తయారైంది.