రాష్ట్రీయం

నీతి అయోగ్ వైస్ చైర్మన్ 30న ఏపికి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ఈ నెల 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. 30వ తేదీ ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే విఐపి లాంజ్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం ప్రదర్శన, ప్రభుత్వ హెల్త్ సబ్‌సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన సందర్శిస్తారు. మధ్యాహ్నా భోజనానంతరం ఆయన 3 గంటల నుంచి సిఎం ఎన్.చంద్రబాబునాయుడు, ఇతర ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై ఐదు విభాగాలుగా సమీక్షిస్తారు. రాత్రికి సిఎం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. రాత్రి విజయవాడలోని హోటల్ గేట్‌వేలో బస చేస్తారు. తర్వాత రోజు ఉదయం 9.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళతారని అధికార ప్రకటన వెల్లడించింది.

అంగన్‌వాడీ కార్యకర్తల
తొలగింపునకు రంగం సిద్ధం
కృష్ణాలో 2500 మంది గుర్తింపు
విజయవాడ, డిసెంబర్ 24: ఈనెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీల తొలగింపుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని పోలీసులు నాటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు తమవద్దనున్న వీడియో టేపులు, ఫోటోల ద్వారా కిందామీదా పడుతున్నారు. తమకు లభించిన ఆధారాలను ఆయా జిల్లాలకు పంపిస్తున్నారు. ఒక్క కృష్ణాజిల్లా నుంచి 2500 మంది అంగన్‌వాడీలు పాల్గొన్నట్లు గుర్తించారు. వీరందరినీ ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రేపో మాపో ఉత్తర్వులు జారీకాగలవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

పిఆర్‌సి అమలు చేయాలి
మోడల్ స్కూళ్ల టీచర్స్ సమాఖ్య డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు తక్షణం పిఆర్‌సిని అమలు చేయాలని ఎపి మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. గురువారం జరిగిన యుటిఎఫ్ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ 10వ పిఆర్‌సి అమలుతో పాటు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను వర్తింపచేయాలని, సర్వీస్ రూల్స్‌ను విడుదల చేయాలని, మహిళా ఉపాధ్యాయులను హాస్టల్ వార్డెన్లుగా నియమించరాదని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానకార్యదర్శి బోసు బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు విడుదల చేయాలని కోరారు.

బ్రిటానియా ఇండస్ట్రీకి పలు రాయితీలు
హైదరాబాద్, డిసెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో 2015 పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని అనుసరించి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు పలు రాయితీలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదివారం జివో జారీ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో తమ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు అయిన బిస్కెట్లు, రస్క్‌ల తయారీ యూనిట్‌ను రూ.145 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి బ్రిటానియా దరఖాస్తు చేసుకుంది.