జాతీయ వార్తలు

రాజకీయ ప్రయోజనాలకే రామనామ జపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఘ్ పరివార్‌పై నితీశ్ కుమార్ ధ్వజం

పాట్నా, డిసెంబర్ 6: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం రామనామ జపం చేస్తున్నాయని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దుయ్యబట్టారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో నితీశ్ మాట్లాడారు. దమ్ముంటే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే తేదీని ప్రకటించాలని ఆయన సంఘ్ పరివార్‌ను డిమాండ్ చేశారు. రామ మందిర నిర్మాణ అంశం బిజెపి లేదా సంఘ్ పరివార్ చేతుల్లో ఏమీ లేదని, అది కోర్టు తేల్చాల్సిన విషయమని, లేకుంటే హిందూ-ముస్లిం మత పెద్దల అంగీకారంతోనే దీనికో పరిష్కారం లభించాల్సి వుంటుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయాలన్నీ తెలిసికూడా సంఘ్ పరివార్ రామ మందిరాన్ని నిర్మిస్తామని వాగ్దానాలు చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ చేసే ఇటువంటి జిమ్మిక్కులు ప్రజల ముందు ఎక్కువ కాలం పనిచేయవని తెలిపారు. సంఘ్ పరివార్ సభ్యులు పలికే ‘రామ్ లాలా హమ్ ఆయేంగే, మందిర్ వాహిన్ బనాయేంగే’ పదాన్ని అనుకరిస్తూ ‘తారీఖ్ నహీన్ బతాయేంగే’ అంటూ ఎద్దేవా చేశారు. (చిత్రం) అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం పాట్నాలో ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్