నిజామాబాద్

ముందడుగా.. వెనుకడుగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాం సుగర్స్ స్వాధీనానికి దారి సుగమమంటున్న తెరాస నేతలు
బోధన్, జనవరి 1: నిజాంసుగర్స్ కర్మాగారాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకునే విషయంలో తెలంగాణ సర్కారు ఎటువంటి అడుగు వేస్తుందో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. కర్మాగారం నిర్వహణలో యాజమాన్యం అనుసరిస్తున్న తీరు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నా యాజమాన్యం తప్పుల మీద తప్పులు చేస్తూ కర్మాగారాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోందని తెరాస సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మాత్రం బయటకు రాలేక పోతోంది. డేల్టా యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించినప్పటికీ ఈ నిర్ణయాన్ని తక్షణమే విరమించాలంటూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ఆదేశించిన సంగతి విధితమే. ఎంపీ కృషితో గత ఐదు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కార్మిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు, డేల్టా యాజమాన్య ప్రతినిధులు కార్మికులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కార్మికులు లే ఆఫ్ ఎత్తివేయాలని కోరుగా అందుకు యాజమాన్య ప్రతినిధులు కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. అలాగే కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎంపీ చేసిన సూచన మేరకు కార్మిక శాఖాధికారులు సైతం పెండింగ్‌లో ఉన్న వేతనాలను సకాలంలో చెల్లించాలని యాజమాన్యానికి తెలియచేశారు. లే ఆఫ్ సంగతెలా ఉన్నప్పటికీ ఫ్యాక్టరీని స్వాథీనం చేసుకునే విషయంలో సర్కారు ఎటువంటి చర్యలు చేపడుతుందన్నది అంతుచిక్కడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం మొదటి నుండీ ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ కర్మాగారాల వ్యవహారంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కర్మాగారానికి చెరకును తోలిన రైతులకు యాజమాన్యం బిల్లులు చెల్లించక పోవడంతో ఇక్కడ ఉన్నటువంటి చక్కెర నిలువలను విక్రయించి వారికి బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కార్మికులు ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమని భావించారు. కానీ యాజమాన్యం అకస్మాత్తుగా లే ఆఫ్ ప్రకటించడంతో కార్మికులు అయోమయ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటి వరకు చక్కెర కర్మాగారాలను స్వాధీనం చేసుకునే విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోలేక పోయినప్పటికీ కొందరు ఎంపీ అనుచరులు మాత్రం ఈ కర్మాగారాలను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవడం నూటికి నూరుపాళ్లు ఖాయమని భరోసాను ఇస్తున్నారు. ప్రస్తుత ప్రైవేటు యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించి మరో తప్పు చేసిందని కావున కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నెల ఆరవ తారీఖు లోపు ఫ్యాక్టరీల విషయమై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈ లెక్కన సర్కారు ఏమి చేస్తుందనేది ఎవ్వరూ అంచనా వేయలేక పోతున్నారు. బోధన్‌లో ఉన్న చక్కెర కర్మాగారంతో పాటు డిస్టిల్లరీ కర్మాగారం వలన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఇంటలిజెన్స్ వర్గాలు సైతం దీనికి సంబంధించి నివేదికలు కూడా సర్కారుకు అందచేసినట్లు సమాచారం. అయితే కర్మాగారాల అభివృద్ధి కోసం పెట్టిన వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులు, బ్యాంకుల అప్పులు చెల్లించే విషయంలో యాజమాన్యానికి, ప్రభుత్వానికి నడుమ చర్చలు జరిగితే గానీ సర్కారు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానాలు, ప్రజల నుండి వచ్చిన వినతులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తుండటంతో బోధన్ నిజాంసుగర్స్ విషయంలో కూడా ముఖ్యమంత్రి స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీ కవిత అధికారులకు సూచిస్తుండటంతో ప్రభుత్వ నిర్ణయం పై కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలను ఉద్ధృతం చేస్తుండటంతో ప్రభుత్వం కర్మాగారాల స్వాధీనం విషయంలో ముందడుగు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అట్టహాసంగా వేడుకలు
బోధన్, జనవరి 1: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూబోధన్ పట్టణంలో జరుపుకున్న నూతన సంవత్సర వేడుకలను స్థానిక ప్రజలు అట్టాహాసంగా జరుపుకున్నారు. గురువారం రాత్రి నుండి ప్రారంభమైన వేడుకలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ప్రధానంగా యువకులు ప్రధాన వీధుల్లోకి చేరుకుని పెద్దపెట్టున ‘హ్యాపీ న్యూ ఇయర్’ నినాదాలిస్తూ సందడిని చేశారు. రాత్రి 12గంటలు కాగానే ప్రధాన కూడళ్ల వద్ద బాణాసంచాను పేలుస్తూ సంబరాల్లో మునిగితేలారు. మరికొందరు యువకులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ న్యూ ఇయర్ ప్రత్యేకతను చాటి చెప్పారు. పది గంటల నుండి అర్ధరాత్రి వరకు విందు బోజనాలు చేసి అర్ధరాత్రి కాగానే న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుకుని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొందరు వ్యాపారులు లాడ్జీలలో గదులు అద్దెకు తీసుకుని విందు బోజనాలు చేసి వేడుకలను అట్టాహాసంగా జరుపుకుని ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. విద్యార్థినులు, మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. గురువారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కూడా పట్టణంలోని అన్ని మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా వైన్‌షాపుల ఎదుట మద్యంప్రియులు బారులుతీరి నిలబడ్డారు. కాగా, మాంస విక్రయాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని చికెన్, మటన్ దుకాణాలలో పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగాయి. శక్కర్‌నగర్ చౌరస్తా, వీక్లీ మార్కెట్‌లోని మాంసం దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిట లాడాయి. కొత్త సంవత్సరం బేకరీ షాపులకు కూడా భలే గిరాకీ తెచ్చింది. బేకరీల నుండి పెద్దఎత్తున కేకులు అమ్ముడుపోయాయి. కొత్త బస్డాండ్, పాతబస్టాండ్, గోషాల రోడ్‌లలో గల దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిట లాడాయి. ఈ ఏడాది పోలీసులు పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించారు. రాత్రి పది గంటల నుండియే అధికారులు జీపులలో రోడ్లపై తిరుగుతూ గుంపులకు కళ్లెం వేశారు. అధికారులు ప్రధాన కూడళ్ల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజే సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పదిగంటల వరకు పట్టణంలోని రోడ్లపై విస్త్రుతంగా తనిఖీలు నిర్వహించి హల్‌చల్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ద్విచక్ర వాహనాలపై ట్రిబుల్ రైడింగ్ జరుగకుండా ఉండేందుకు అధికారులు ఈ సారి కట్టుదిట్ట చర్యలు చేపట్టారు.

డెక్కన్ సుగర్స్ కార్మికుల రాస్తారోకో
బోధన్, జనవరి 1:బోధన్ నిజాండెక్కన్ సుగర్స్ కార్మికులు శుక్రవారం పట్టణంలోని సాత్‌పూల్ కెనాల్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కర్మాగారంలో యాజమాన్యం తీసుకున్న లే ఆఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు రాస్తారోకో చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత స్థాయి అధికారుల వద్ద జరిగిన చర్చలలో లే ఆఫ్‌ను ఎత్తివేస్తామని ప్రకటించిన యాజమాన్య ప్రతినిధులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయమని కార్మిక నాయకులు పేర్కొన్నారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వలన కార్మికులు రోడ్డు పాలు కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యాజమాన్యం లే ఆఫ్‌ను ఎత్తివేయాలని తమకు రావాల్సిన మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల రాస్తారోకో వలన బోధన్ - నిజామాబాద్ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులను సముదాయించి ఆందోళన విరమించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఈరవేణి సత్యనారాయణ, కుమారస్వామి, రాజారామ్, సాయిలు, ఏశాల గంగాధర్, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

స.హ చట్టం క్యాలెండర్ ఆవిష్కరణ
ఇందూర్, జనవరి 1: ‘సమాచార హక్కు చట్టం-2005’ నూతన సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్ యోగితారాణా శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆ సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్య పౌరులకు వజ్రాయుధం వంటిదని, సమాజంలో జరిగే ఎలాంటి అవినీతినైనా ఈ చట్టం ద్వారా వెలితీయవచ్చని పేర్కొన్నారు. ఈ చట్టంపై సమాచార హక్కు చట్టం-2005 పరిరక్షణ సంఘం ప్రతినిధులు గ్రామీణ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకవచ్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో స.హ చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కారంపుడి నారాయణ, నాయకులు ఎస్‌ఎ.సలీం, రాజేశం, భుజంగ లింగం, అంకం శ్యామ్‌రావు, విజయ్‌గౌడ్, ఆర్.్భస్కర్‌రాజ్, సాయిలు, నగేష్‌గౌడ్, ప్రకాష్, రాములు, సుధాకర్, సాయిలు, శేక్ మక్సూద్ తదితరులు పాల్గొన్నారు.