జాతీయ వార్తలు

జిఎస్టీ నష్టాల భర్తీకి నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: జిఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వివిధ రూపాల్లో ఎదురయ్యే నష్టాల భర్తీకి నష్టపరిహారాల చెల్లింపు నిధి ఏర్పాటు చేసి తీరాలని ఆంధ్రప్రదేశ్ కరాఖంఢిగా చెప్పింది. నిధి ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసి బిల్లులో పొందుపర్చి తీరాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. జిఎస్పీ అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ శుక్రవారం ఇక్కడ సమావేశమైంది. సమావేశంలో యనమల మాట్లాడుతూ నష్టపరిహార నిధి లేకుంటే, రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు. నిధి ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సిందిగా ఆంధ్ర డిమాండ్ చేస్తోందన్నారు. జిఎస్టీ పరిధి నుంచి ధాన్యంసహా మరికొన్ని ఆహార ధాన్యాలను మినహాయించటం వల్ల ఆంధ్రకు సాలీనా 700 కోట్ల ఆదాయానికి గండి పడుతుందన్నారు. కాగా ఇప్పుడున్న పన్నుశాతం భవిష్యత్‌లో మారే అవకాశాలు ఉన్నందున, ఈ రూపంలో మరో రెండువేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచాలన్న ప్రతిపాదన అమలుకు ముందు, ఈ ఉత్పత్తులపై పన్నులు విధించుకునే అధికారాలు రాష్ట్రాలకు విడిచిపెట్టాలని సూచించారు. 2011-12కు సంబంధించి జిఎస్టీ కింద ఆంధ్రకు 1873 కోట్లు బకాయి లభించాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లిస్తామని ఇచ్చిన హామీమేరకు ఇంతవరకూ 672 కోట్లు మాత్రమే అందాయన్నారు. మిగిలిన మొత్తం చెల్లింపునకు తగిన చర్యలు తీసుకోవాలని యనమల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలకు ప్రకటనల రూపంలో వస్తున్న ఆదాయాన్ని కత్తిరించొద్దని కోరారు. జిఎస్టీ అమలులో తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తూ తమ కమిటీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపిన నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియచేయాలని యనమల డిమాండ్ చేశారు.