జాతీయ వార్తలు

కోడ్ దాటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తప్పుబట్టింది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచీ కొత్త హామీలు, ప్రకటనలు చేయరాదన్న నిబంధన ఉంది. బీసీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని చెప్పడం, క్రిస్మస్ పండుగను ప్రభుత్వ పండువగా నిర్వహిస్తామని ప్రకటించడం, పోలీసు రిక్రూట్‌మెంట్ చేపడతామని ప్రకటించడంపై ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. భవిష్యత్‌లో ఈవిధమైన ఉల్లంఘనలు పునరావృతంకాకుండా వ్యవహరించాలని ఎన్నికల సంఘం సూచించింది.