జాతీయ వార్తలు

కుట్ర భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: దేశరాజధాని న్యూఢిల్లీలో ఉగ్రదాడుల కుట్రను పోలీసులు బుధవారం భగ్నం చేశారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 12మంది టెర్రరిస్టులను అరెస్టు చేశారు. జైష్ ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిఘావర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్‌కు చెందిన 12 ప్రత్యేక బృందాలు బుధవారం ఉదయం నుంచి ఒకేసారి మూకుమ్మడి దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 12 మందిని అరెస్టు చేయటంతో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను, ఐ ఈడీలను, బాంబుల తయారీ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కనీసం 30 జాగిలాలను కూడా వినియోగించారు. దేశ రాజధానిలోని అత్యంత కీలకమైన ప్రదేశాలలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు జైష్ కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను కోర్టులో ప్రవేశపెట్టగా మే 14వరకు వారిని పోలీసు కస్టడీ విధించారు. అరెస్టయిన వారిలో నలుగురు ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బాండ్ ఇస్లామిక్ సెమినరీకి చెందిన వారని భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో సాజిద్ అహ్మద్, సమీర్ అహ్మద్, షకీర్ అన్సారీలు ఐఈడీ పేలుడు పదార్థాలను తయారు చేస్తారని పోలీసులు తెలిపారు. వీరి కదలికలపై ఏడాది కాలంగా నిఘా వర్గాలు కనే్నసి ఉంచాయి. ఈ ముగ్గురిలో సాజిద్ గత పదిహేను రోజులుగా ఐ ఈడీ తయారీ పనిలో ఉన్నాడని.. మంగళవారం రాత్రి బాంబును తయారు చేస్తుండగా ప్రమాద వశాత్తూ అతని ఎడమచేయికి గాయమయిందని పోలీసులు వివరించారు.