జాతీయ వార్తలు

మోదీ సర్కారు అస్థిరతకు కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్‌లో సామాజిక అశాంతిని సృష్టించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి పెద్ద కుట్ర పన్నాడని నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) పేర్కొంది. దేశంలో మత క ల్లోలాలను సృష్టించడంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను హతమార్చడానికి, చర్చిలపై దాడులు చేయడానికి దావూద్‌కు చెందిన కరడుగట్టిన నేరస్థులతో కూడిన డి-కంపనీలోని పది మందికి బాధ్యతలు అప్పగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక తెలిపింది. దావూద్ పన్నిన కుట్ర విషయమై ఎన్‌ఐఎ శనివారం చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే దావూద్ గ్యాంగ్ ఈ కుట్ర పన్నిందని ఎన్‌ఐఎ తన చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్వాధీనం చేసుకోవలసిందిగా కోరుతూ భారత్ ఆరు దేశాలకు రొగేటరీ లేఖలు పంపించింది. దావూద్ కుట్రలో భాగంగా డి-కంపనీకి చెం దిన షార్ప్ షూటర్లు 2015 నవంబర్ రెండో తేదీన గుజరాత్‌లోని భారుచ్‌లో శిరీశ్ బంగాలి, ప్రగ్నేశ్ మిస్ర్తి అనే ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను హత్య చేశారని ఎన్‌ఐఎ పేర్కొంది. ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడయిన యాకుబ్ మెమన్‌ను ఉరితీసినందుకు ప్రతీకారంగా ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను హతమార్చినట్లు అరెస్టయిన ఇద్దరు షార్ప్ షూటర్లు ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్లు తెలిపింది. పాకిస్తాన్‌కు చెందిన జావేద్ చిక్నా, దక్షిణాఫ్రికాకు చెందిన జాహిద్ మియాన్ అలియాస్ జావో అనే ఇద్దరు డి-కంపనీ సభ్యులు గుజరాత్‌లో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల హత్యకు పథక రచన చేయడంతో పాటు మత నాయకులపై, చర్చిలపై దాడులు చేయడం ద్వారా దేశంలో పెద్ద ఎత్తున మత ఘర్షణలను సృష్టించడానికి కుట్ర పన్నారని ఎన్‌ఐఎ తెలిపింది. వారు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల హిట్ లిస్టును కూడా తయారు చేశారని వివరించింది.
పాకిస్తాన్‌లో ఉన్న చిక్నాను వెతికి, అరెస్టు చేసి భారత్‌కు అప్పగించాల్సిందిగా ఎన్‌ఐఎ ఇటీవల ఇంటర్‌పోల్‌ను కోరింది. అలాగే ఎన్‌ఐఎ పాకిస్తాన్, నేపాల్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాలకు రొగేటరి లేఖలు పంపించడంతో పాటు పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్‌ఎటి) కింద విజ్ఞప్తులు చేసింది.

నిరుడు అరెస్టయిన ఏడుగురు- హజి పటేల్, మొహమ్మద్ యూనస్ షేక్, అబ్దుల్ సమాద్, ఆబిద్ పటేల్, మొహమ్మద్ అల్త్ఫా, మొహిసిన్ ఖాన్, నిసార్ అహ్మద్- సహా డి-కంపనీకి చెందిన పది మంది సభ్యుల పేర్లను ఎన్‌ఐఎ తన చార్జిషీట్‌లో పేర్కొనే అవకాశం ఉంది. జావేద్ చిక్నాకు సోదరుడిగా భావిస్తున్న ఆబిద్ పటేల్‌కు మిస్ర్తి, బంగాలీని హతమార్చినందుకు రూ. 50 లక్షలు ముట్టినట్లు ఎన్‌ఐఎ పేర్కొంది. జావేద్ చిక్నా, జాహిద్ మియాన్‌ల పేర్లను కూడా ఈ చార్జిషీట్‌లో ఎన్‌ఐఎ పేర్కొంటుందని సమాచారం. అయితే ఈ కుట్రలో దావూద్ ఇబ్రహీం పాత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయితే అనుబంధ చార్జిషీట్‌లో అతని పేరును పేర్కొంటుందని ఆ కథనం తెలిపింది.