జాతీయ వార్తలు

చుట్టూ నీళ్లున్నాయ.. తాగడానికి గుక్కెడు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుట్టనాడ్ (కేరళ), మే 8: కేవలం ప్రభుత్వాలను మార్చడం గురించి కాక తమ భవిష్యత్తుల గురించి కూడా ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ప్రజలకు ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఇనే్నళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు కనీసం తాగు నీరు కూడా అందించలేకపోయాయంటూ యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాలను ఆయన దుయ్యబట్టారు. ‘కేరళ చుట్టూ నీళ్లున్నాయి. అయినా ఇప్పటికీ ఇక్కడ మంచినీళ్లు లేవు. భారతదేశం స్వాతంత్య్రం పొంది వచ్చే ఏడాదికి 70 ఏళ్లు పూర్తవుతుంది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలో ఉన్నాయ. అయినా కనీసం తాగునీరు అందించాలనే విషయాన్ని కూడా వాళ్లు పట్టించుకోలేదు’ అని కేరళలోని కుట్టనాడ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో మోదీ అన్నారు. అవినీతి విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు రెండూ ఒకటేనని కూడా అన్నారు. ‘వీళ్లు రొటేషన్ పద్ధతిలో అయిదేళ్లపాటు అధికారం అనుభవించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఎదుటి వారి పాపాలను చూడకూడదని, వారి అవినీతి చిట్టాలను విప్పకూడదని వాళ్లు నిర్ణయించుకున్నారు’ అని ప్రధాని అన్నారు. ‘కేవలం ప్రభుత్వాలు మారితే చాలా లేక మీ భవిష్యత్తులు కూడా మారాలో లేదో మీరు ఆలోచించండి’ అని ఆయన అన్నారు.
అంతకుముందు కాసరగోడ్‌లో జరిగిన మరో ఎన్నికల ర్యాలీలో సైతం ప్రధాని రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులపై ధ్వజమెత్తుతూ, ఈ రెండు పార్టీలు తమ సర్దుబాటు రాజకీయాల ద్వారా విద్యావంతులైన కేరళ ప్రజలను అవమాన పరుస్తున్నారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించిందని ప్రధాని అన్నారు. కేరళలో ప్రధాన వాణిజ్య పంటలయిన కొబ్బరి, పోక రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని, వారు ఎదుర్కొంటున్న కష్టాలు తమకు తెలుసునని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకం, ముద్రా యోజన ప్రయోజనాల గురించి వివరించారు. సిపిఎం పాల్పడుతున్న హింసా రాజకీయాల వల్ల కేరళ రాష్ట్రం నాశనమవుతోందని ఆయన అంటూ, సిపిఎం కార్యకర్తల చేతిలో రెండు కాళ్లు పోగొట్టుకున్న సదానంద మాస్టర్ అనే బిజెపి కార్యకర్తను సభకు పరిచయం చేశారు. ఆయన చేసిన తప్పల్లా దాడి చేసిన వారి సిద్ధాంతంతో ఏకీభవించక పోవడమేనని అన్నారు. కేరళలో ఏదయినా సంఘటన జరిగితే కేంద్రానికి బాధ కలుగుతుందన్నారు. ‘కొనే్నళ్ల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 102 మంది చనిపోతే ప్రధానమంత్రేకాదు.. ఎవరు కూడా రాలేదని, అయితే ఇటీవల కొల్లాంలోని పుట్టింగల్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ఈ దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు’ అని మోదీ అన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని మలయాళంతో ప్రారంభించినప్పుడు సభకు పెద్దసంఖ్యలో వచ్చిన జనం హర్షధ్వానాలు చేశారు.
chitram...
కేరళలోని కాసరగోడ్‌లో బిజెపి నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిపిఎం కార్యకర్తల చేతిలో కాళ్లు పోగొట్టుకున్న సదానంద మాస్టర్‌ను సభకు పరిచయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ