జాతీయ వార్తలు

నవంబర్ 9నుంచి మందిర నిర్మాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయిని, మే 8: అయోధ్యలోని రామజన్మభూమిలో ఈ సంవత్సరం నవంబర్ 9నుంచి మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని కొందరు సాధువులు తాజాగా ఉజ్జయినిలో తీర్మానించారు. అయితే తేదీ ప్రకటించినట్లయితే అనవసర వివాదానికి తెరలేపినట్లవుతుందని అధికారికంగా ప్రకటించవద్దని నిర్ణయించినట్లు సమాచారం. ఉజ్జయినిలో కొనసాగుతున్న సింహస్థ కుంభమేళాలో భాగంగా గతవారం ప్రారంభంలో దాదాపు 250 మంది సాధు సంతులు సమావేశమై రామమందిర నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ న్రత్య గోపాల దాస్ హాజరైన ఈ సమావేశంలో శంకరాచార్య వాసుదేవానంద్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కమిటీ చీఫ్ అఖిలేశ్వరానంద్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సాధువులంతా ఆలయ నిర్మాణంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు శిబిర ప్రచార ఇంచార్జి సచిన్ బఘెల్ అన్నారు. ఆలయ నిర్మాణం ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. ఈ అంశంలో ప్రజల సహన గుణం కూడా తగ్గిపోతోందని సాధువులు అభిప్రాయపడ్డట్లు సచిన్ తెలిపారు. రామజన్మభూమి మందిర నిర్మాణ న్యాస్ మాత్రం విహెచ్‌పీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మందిర నిర్మాణానికి వీహెచ్‌పీ కృషి చేయలేదని భావిస్తోంది. ఇలావుండగా జూన్‌లో రామమందిర నిర్మాణానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఆ విచారణను ఆధారం చేసుకునే మందిర నిర్మాణం కోసం పోరాటం చేస్తున్నవారి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది.
chitram....
ఉజ్జయనీలో జరుగుతున్న కుంభమేళాకు
ఆదివారం తరలివచ్చిన భక్తులు