జాతీయ వార్తలు

పాక్‌తో సంబంధాలపై 14న సుష్మ ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14న పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేయనున్నారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఇటీవలి పరిణామాలపై పార్లమెంట్‌లో ప్రకటన చేయడానికి సుష్మా స్వరాజ్ సిద్ధంగా ఉన్నారని, ఈ నెల 14న (సోమవారం) ఆమె ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి శుక్రవారం లోక్‌సభలో చెప్పారు. 14న ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 2గంటలకు లోక్‌సభలో సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తారని ఆయన వివరించారు. సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో ప్రకటన చేయడంలో ఆలస్యమయిందని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత రాయ్ అన్నారు. సుష్మా స్వరాజ్ శుక్రవారం సభలో ప్రకటన చేస్తారని ప్రభుత్వం గురువారం చెప్పింది. సుష్మా స్వరాజ్ బుధవారం పాకిస్తాన్‌ను సందర్శించిన సందర్భంగా సమగ్ర ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
ప్రపంచ దేశాలతో సంబంధాలు
మరింతగా పెరుగుతాయి
రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్యం తదితర రంగాల్లో ఇతర దేశాలతో భారత దేశ సంబంధాలు మరింతగా పుంజుకుంటాయని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. విదేశాంగ విధానంలో కెరీర్‌ను చేపట్టే విషయాన్ని పరిశీలించాలని ఆమె యువతకు విజ్ఞప్తి చేసారు. 21వ శతాబ్దాన్ని ‘ఆసియా శతాబ్దం’గా ఆమె అభివర్ణిస్తూ, మనం ఈ నూతన శతాబ్దంలోకి అడుగుపెట్టిన కొద్దీ రేపు భవిష్యత్తులో ఎదురుకాబోయే పెద్ద సమస్యలను దేశాలు సొంతంగా పరిష్కరించుకోలేవనే విషయం కూడా స్పష్టమవుతోందని ఆమె అన్నారు. శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులకోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలయిన వారిని సత్కరించిన కార్యక్రమంలో సుష్మాస్వరాజ్ మాట్లాడారు. జవహర్‌లాల్ నెహ్రూ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఒక్కో కేంద్రీయ విద్యాలయ రీజియన్‌నుంచి 25 మంది విజేతలను సత్కరించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్, కార్యదర్శి అనిల్ వాధ్వా, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ సంతోష్ కుమార్ మాల్ తదితరులు హాజరయ్యారు. ఒక్కో రీజియన్‌నుంచి విజేతలయిన 25 మందిలో కూడా బాలురకంటే బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాదు, మూడు గ్రాండ్‌ప్రైజ్‌లను గెలుచుకున్న వారు కూడా బాలికలే. రాయపూర్ కెవి రీజియన్‌కు చెందిన ఒడిశాలోని బార్‌గర్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల అలిభా ప్రియదర్శిని ప్రథమ బహుమతిని గెలుచుకుంది.