జాతీయ వార్తలు

అగ్రకులం ఆగ్రహించింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, మే 8: మహారాష్టల్రో అగ్రవర్ణాల వారు తమకు నీరు అందకుండా చేయడంతో ఆగ్రహం చెందిన ఒక దళిత శ్రామికుడు పట్టుదలతో గంటల కొద్దీ శ్రమించి సొంతగా బావిని తవ్వుకోవడం ద్వారా వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. కరవు పీడిత విదర్భ ప్రాంతంలోని వాషిమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మాలెగావ్ తాలూకా కొలంబేశ్వర్ గ్రామంలో అగ్రవర్ణాల వారు తమ బావి నుంచి నీటిని తోడుకోనీయకుండా బాపూరావ్ టాగ్నే అనే దళితుడి కుటుంబాన్ని బహిష్కరించారు. గ్రామంలో మరికొన్ని ఇతర వర్గాల ప్రజలను కూడా ఈ విధంగా వెలి వేయడంతో ఆగ్రహం చెందిన టాగ్నే 40 రోజులు కష్టపడి సొంతగా బావిని తవ్వుకుని తన కుటుంబ సభ్యుల దాహార్తిని తీర్చడంతోపాటు ఆ ప్రాంతంలోని ఇతర దళిత కుటుంబాల దాహార్తిని కూడా తీర్చాడు. ఈ బావి తవ్వకానికి ఉపక్రమించినప్పుడు కుటుంబ సభ్యులతోపాటు ఇరుగు పొరుగువారు తనను చూసి పరిహసించినప్పటికీ ధృఢసంకల్పంతో ముందుకు సాగానని, బావిలో పుష్కలంగా నీరు లభించడంతో ఎంతో సంతోషం కలుగుతోందని టాగ్నే తెలిపాడు. ఈ ఘటన గురించి వాషిమ్ జిల్లా ఉన్నతాధికారులకు తెలియడంతో ఆ గ్రామానికి తరలివచ్చి టాగ్నేని అభినందనలతో ముంచేశారు. పట్టుదలకు, ధృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచావంటూ టాగ్నేని అభినందించారు.

లోయలో పడిన బస్సు
12 మంది మృతి

సిమ్లా, మే 8: హిమాచల్‌ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది మృతిచెందగా, 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర రాజధాని సిమ్లాకు దాదాపు 210 కి.మీ. దూరంలోని మండి జిల్లా జోగిందర్‌నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో 12 మంది మృతిచెందగా, గాయపడిన 39 మందిని ఆసుపత్రులకు తరలించారు. జోగిందర్‌నగర్‌లోని ఆసుపత్రిలో 20 మందిని చేర్చగా, 19 మందిని పిజిఐ చండీగఢ్, తాండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్చారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తాండలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సోనియాగాంధీకి సిఐసి తాజా నోటీసు

న్యూఢిల్లీ, మే 8: సమాచార హక్కు చట్టం కింద దాఖలయిన ఒక దరఖాస్తుకు సమాధానం ఇవ్వనట్లు వచ్చిన అభియోగాలపై కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఫుల్ బెంచ్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ కమిషన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాజాగా నోటీసు జారీ చేసింది. ఆర్‌కె జైన్ అనే సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ ఈ నోటీసు జారీ చేసింది. సమాచార కమిషనర్ బిమల్ జుల్కా, శ్రీ్ధర్ ఆచార్యులు, సుధీర్ భార్గవతో కూడిన కమిషన్ ఫుల్ బెంచ్ జైన్ ఫిర్యాదును విచారిస్తుంది. ఫిర్యాదుపై వేగంగా స్పందించాలని, ఆరు నెలల్లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు 2014 ఆగస్టులో ఆదేశించిన విషయం తెలిసిందే. దీని తరువాత జైన్ కేంద్ర సమాచార కమిషన్‌కు ఆ సంస్థ రిజిస్ట్రార్‌పై ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ రిజిస్ట్రార్ ఎం.కె.శర్మ తన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీని విచారించడానికి గడువు విధించలేదని జైన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రిజిస్ట్రార్ దురుద్దేశంతో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై తాను కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తానని జైన్ హెచ్చరించారు. జైన్ తొలుత 2014 ఫిబ్రవరిలో సమాచార హక్కు చట్టం కింద కొంత సమాచారం కోరుతూ కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేశారు. అయితే దానికి సమాధానం రాకపోవడంతో ఆయన తరువాత సిఐసి రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌తోపాటు బిజెపి, సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపి, బిఎస్‌పిలను పబ్లిక్ అథారిటీలుగా సిఐసి ఫుల్ బెంచ్ తన ఆదేశాలలో పేర్కొందని, పబ్లిక్ అథారిటీగా కాంగ్రెస్ తన దరఖాస్తుకు సమాధానం ఇవ్వకపోవడం ఫుల్ బెంచ్ ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని జైన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జైన్ చేసిన ఫిర్యాదును సిఐసి ఫుల్ బెంచ్ విచారించనుంది.