జాతీయ వార్తలు

లోక్‌సభ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ఎన్‌డిఏ ప్రభుత్వం తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల పేరుతో గడువుకు రెండు రోజుల ముందే లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయించింది. దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చ ముగిసిన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాలకు లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదిలా ఉంటే రాజ్యసభ కూడా గడువుకు ఒక రోజు ముందు అంటే గురువారం నిరవధికంగా వాయిదా పడనున్నది. ఉభయ సభలు ముందు నిర్ణయించిన ప్రకారమైతే పదమూడో తేదీనాడు వాయిదా పడవలసి ఉండింది. అయితే కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలను సిద్ధం చేయలేకపోవటంతో లోక్‌సభ బుధవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడితే రాజ్యసభ రేపు నిరవధికంగా వాయిదా పడనున్నది. ఏప్రిల్ 25వ తేదీనాడు ప్రారంభమైన పార్లమెండు బడ్జెట్ మలివిడత సమావేశాల్లో అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటం తదితర అంశాలపై పెద్దఎత్తున గొడవ జరగటం తెలిసిందే. బిజెపి అధినాయకత్వం ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో చర్చించిన తరువాతనే పార్లమెంటును గడువుకు ముందే వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి ఉభయ సభలను గత శుక్రవారం నాడే నిరవధికంగా వాయిదా వేయాలనుకున్నారు. అయితే లోక్‌సభ ఆమోదించిన ఆర్థిక బిల్లుపై రాజ్యసభలో అనుకున్న సమయానికి చర్చ జరిగి తిరిగి లోక్‌సభకు పంపించలేకపోవటంతో నిరవధిక వాయిదాను మానుకున్నారు. బుధవారం రాజ్యసభలో ఆర్థిక బిల్లులపై చర్చ జరిపి తిరిగి లోక్‌సభకు పంపించారు. ఆర్థిక బిల్లు లోక్‌సభ కార్యాలయానికి చేరుకున్నట్లు అధికారికంగా ముద్ర పడగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
రాజ్యసభను కూడా బుధవారమే నిరవధికంగా వాయిదా వేయాలనుకున్నారు. అయితే రాజ్యసభ నుండి రిటైర్ అవుతున్న 58 మంది సభ్యులకు వీడ్కోలు ఇవ్వవలసి ఉన్నందున దీనిని రేపటికి వాయిదా వేసుకున్నారు. రాజ్యసభలో గురువారం రిటైర్ అవుతున్న 58 మందికి వీడ్కోలు ఇస్తారు. రిటైర్ అవుతున్నవారి ప్రసంగాలు ముగిసిన అనంతరం చైర్మన్ హమీద్ అన్సారీ, రాజ్యసభ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.