జాతీయ వార్తలు

మీకు రాజ్యాంగ బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: కరవు కాటకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉష్టప్రక్షి చందంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండజాలదని, తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. సామాన్య ప్రజలకు సంబంధించిన అంశాలన్నింటికీ అంతిమ బాధ్యత కేంద్రానిదేనని, పరిస్థితులను చక్కదిద్దాల్సిన కర్తవ్యం కూడా దానినేనని న్యాయమూర్తులు ఎంబి లోకూర్, ఎన్‌వి రమణలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ బుధవారం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 21వ అధికరణలో పేర్కొన్న అంశాలకు సంబంధించి కేంద్రానిదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది. సమాఖ్య వ్యవస్థకు రాజ్యాంగ బాధ్యతకు మధ్య సునిశితమైన సమతూకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కేంద్రానికి స్పష్టం చేస్తూనే, కరవు కాటకాల విషయంలో దాని బాధ్యతనూ గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే విషయంలో ఉదాసీన వైఖరిని అవలంబిస్తే కేంద్రం తన గురుతరమైన బాధ్యతను నిర్వర్తించలేకపోతే అంతిమంగా సామాన్యుడే నష్టపోతాడని తెలిపింది. కరవు పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఈ సందర్భంగా పలు ఆదేశాలనూ జారీచేసింది. సంక్షోభ సమయాల్లో, అలాగే ఉత్పన్నమయ్యే సమస్యాత్మక పరిస్థితులకు సంబంధించి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకపోతే న్యాయ వ్యవస్థ జోక్యం అనివార్యం అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన ఆదేశాలను జారీచేయడం కోర్టుకు తప్పనిసరి అవుతుందని పేర్కొంటూనే, ఇందుకు సంబంధించి లక్ష్మణ రేఖను గీయాల్సిన అవసరం ఉందని తెలిపింది. మొత్తం 53 పేజీల తీర్పులో అనేక అంశాలను ప్రస్తావించిన కోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాత్మక రీతిలో వ్యవహరించడం ద్వారానే ఈ పరిస్థితులను అధిగమించగలుగుతాయని తెలిపింది. సామర్థ్యం, వనరులు లేకపోవడం అన్నది సమస్య కాదు.. చిత్తశుద్ధి లేకపోవడమే అసలు సమస్య అంటూ బాల గంగాధర తిలక్ చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ప్రస్తుత కరవు పరిస్థితుల విషయంలో బీహార్, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే, వీటిని ఎదుర్కొనే విషయంలో చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగానే గోచరిస్తోందని తెలిపింది. తమ రాష్ట్రాల్లో కరవు పరిస్థితులున్నాయన్న వాస్తవాల్ని అంగీకరించడానికి అక్కడి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం అన్నది తీవ్రమైన విషయమని తెలిపింది. ఇప్పటివరకు జాతీయ ప్రణాళికలను గాని, జాతీయ విపత్తుల నివారణ నిధిని గానీ ఏర్పాటు చేయకపోవడం అన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపింది. 2005లో విపత్తుల నిర్వహణ చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ ఇంతవరకు ఇందుకు సంబంధించిన నిధిని ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలో జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే మూడు నెలల వ్యవధిలోనే జాతీయ విపత్తుల నిర్వహణ నిధిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.