జాతీయ వార్తలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఒడిశా, చత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలను ముంపునకు గురిచేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని బీజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ డిమాండ్ చేశారు. మహతాబ్ శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో పోలవరం నిర్మాణాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై ఆయన ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. 16వ లోక్‌సభలో పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని తాను చెప్పానన్న మహతాబ్ గత్యంతరం లేని పరిస్థితిలోనే ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలనే డిమాండ్ చేయవలసి వస్తోందని అన్నారు. పోలవరం నిర్మాణం వల్ల ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు జరిగే నష్టంపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 42 కిలోమీటర్ల ఎగువన గోదావరి నదిపై నిర్మిస్తున్న ఇందిరా సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని గిరిజనులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు తెలియజేయకుండా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా పోలవరం ప్రాజెక్టుకు పలు అనుమతులు ఇచ్చారని బర్తృహరి మహతాబ్ ఆరోపించారు.
అలాగే కేంద్ర జల సంఘం పోవలవరం ప్రాజెక్టుకు టిఏసి అనుమతులు ఇచ్చే సమయంలోఒడిశా,చత్తీస్‌గఢ్‌లతో సంప్రదించలేదన్నారు. అటవీ, పర్యావరణ అనుమతి ఇచ్చే సమయంలో కూడా తమతో సంప్రదించలేదని మహతాబ్ విమర్శించారు. పోలవరం విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం రాబట్టడానికే తానీ అంశంపై వాయిదా తీర్మానంతో పాటు సావధాన తీర్మానం ప్రతిపాదించవలసి వచ్చిందని మహతాబ్ వివరించారు.