అంతర్జాతీయం

హిల్లరీకి మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్లెస్టన్(అమెరికా), మే 11: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ రేసులో డెమొక్రాట్ల మధ్య పోరు ఉత్కంఠగా మారుతోంది. ఓ వైపు రిపబ్లికన్‌ల తరపున ఖాయమైన అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. డెమొక్రాట్ల హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన హిల్లరీ క్లింటన్‌కు ఆమె ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు. పశ్చిమ వర్జీనియాలో జరిగిన ప్రైమరీలో సాండర్స్, హిల్లరీని ఓడించి విస్మయం కలిగించారు.
ఈ గెలుపుతో భారీగా డెలిగేట్ల మద్దతును ఇప్పటికే సంపాదించిన హిల్లరీ ఆధిక్యాన్ని నిలువరించలేకపోయినప్పటికీ.. ఆమె వైట్‌హౌస్ ప్రవేశం నల్లేరు మీద నడక కాదని నిరూపించారు. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీల్లో 23 రాష్ట్రాల్లో హిల్లరీ గెలవగా.. సాండర్స్ 19రాష్ట్రాల్లో విజయం సాధించటం విశేషం. అయితే డెమొక్రాట్ అభ్యర్థిగా నామినేషన్ పొందటానికి హిల్లరీకి 94శాతం అవకాశాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్‌కు అవసరమైన 2383 డెలిగేట్ల మద్దతుకు కేవలం 144 డెలిగేట్ల మద్దతు దూరంలో హిల్లరీ ఉన్నారు. కాగా,ప్రైమరీ సీజన్ పూర్తయేంతవరకూ తాను పోరాటం ఆపేది లేదని సాండర్స్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ గనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయితే కార్మికుల ఆదాయాలు తగ్గిపోతాయని, ఫలితంగా వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ రేసులో ముందంజలో ఉన్న హిల్లరీ క్లింటన్ హెచ్చరించారు. అయితే అలాంటి ప్రమాదం ఎదురవుతుందని తాను అనుకోవడం లేదని ఆమె అన్నారు. అలాంటి ఆలోచనలున్న వారిని మనం తిరస్కరించాలని, కార్మికుల కుటుంబాలకు, వారి పిల్లలకు మరింత మెరుగైన విధానంతో మనం ముందుకు రావాలని లూయిస్‌విల్లేలో తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ హ్లిలరీ క్లింటన్ అన్నారు. కార్మికుల్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్లతో పాటుగా అన్ని వర్గాలకు చెందిన వారున్నారని, అయితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం ఒకే రకంగా ఉంటాయని, తమ పిల్లలకు మంచి భవిష్యత్తునందించడానికి వారంతా తపన పడుతారని ఆమె అంటూ, ఇందులో రాజకీయాలకు తావుండకూడదని అన్నారు.