జాతీయ వార్తలు

ప్రజాసేవకు రిటైర్మెంట్ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 13: రాజ్యసభ నుండి రిటైర్ అవుతున్న 53మంది సభ్యులకు రాజ్యసభ శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ,ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో పాటు వివిధ పార్టీల నాయకులు రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు ఇస్తూ అభినందనలు తెలిపారు. సభ నుండి రిటైర్ అయినంత మాత్రాన ప్రజాసేవ నుండి రిటైర్ కాకూడదని వారు సూచించారు. రాజ్యసభ జిఎస్‌టి తదితర ప్రధాన బిల్లులను అమోదించకకపోవటం పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిన మోదీ రిటైర్ అయిన తరువాత కూడా ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే రిటైరవువుతున్న సభ్యులు సభలో తమ అనుభవాలను నెమరు వేసుకుంటూ భావోద్రేకానికి లోనయ్యారు. మొదట అన్సారీ మాట్లాడుతూ, ఇంతమంది స్నేహితులు,సహచరులు సభను విడిచివెళ్లడం బాధగా వుందని పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ రిటైర్ అవుతున్న సభ్యులు ముందు,ముందు మరింత మంచి పదవులకు ఎంపిక అయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. కొత్త సభ్యులకు స్వాగతం చెప్పటం, రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు చెప్పుకునే అవకాశం రాజ్యసభకు ఉన్నది కానీ లోక్‌సభకు మాత్రం ఇలాంటి అవకాశం లేదని నరేంద్ర మోదీ ఛలోక్తి విసిరారు. కాంగ్రెస్ ఎంపి అనంద్‌శర్మ మాట్లాడుతూ, ఏకాభిప్రాయం సాధన ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులను ఆమోదం పొందాయన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం ఆరుగురు సభ్యులు రిటైర్ అవుతుండగా ముగ్గురు సభ్యులు వి.హనుమంతరావు, జెడి శీలం, జైరాం రమేష్ మాత్రమే వీడ్కోలు సభలో పాల్గొన్నారు. శీలం తన సభ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని ఆయన విమర్శించారు. విహెచ్ మాట్లాడుతూ తనను రాజ్యసభకు రెండుసార్లు పంపించిన సోనియా, రాహుల్ గాంధీకి ధన్యవదాలు తెలిపారు. జైరాం రమేష్ మాట్లాడుతూ 2004 నుండి యుపిఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూసేకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంతో పాటు తొమ్మిది కీలక బిల్లుల ఆమోదంలో తన పాత్ర ఉందని పేర్కొన్నారు.