జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 15: జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు మరో విజయం సాధించాయి. రెండు నెలలపాటు నిఘా వేసి పాకిస్తాన్ నుంచి కాశ్మీర్‌లోకి చొరబడిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. అయితే కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం పట్టుబడిన అబ్దుల్ రెహమాన్ అనే ఈ ఉగ్రవాది వద్ద ఆధార్ కార్డు ఉండటం భద్రతా బలగాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కార్డు నిజమైనదా, నకిలీదా అనేది తేలాల్సి ఉంది. పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన ఈ ఉగ్రవాదిని పట్టుకున్నట్లు బారాముల్లా డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఒసి) మేజర్ జనరల్ జెఎస్ నాయిన్ బారాముల్లాలో విలేఖరులకు వెల్లడించారు. అబ్దుల్ రెహమాన్‌ను సజీవంగా పట్టుకోవడం పెద్ద విజయమని, ఇంటరాగేషన్‌లో అతనినుంచి కీలక సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నామని నాయిన్ చెప్పారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ తమ ఆత్మాహుతి దాడులకు స్థానికులను నియమించుకుంటున్న విషయం రెహమాన్ అరెస్టు ద్వారా వెల్లడయిందని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లోని బాలాకోట్ శిక్షణ శిబిరంలో ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉగ్రవాద శిక్షణ పొందిన రెహమాన్ మరో నలుగురితో కలిసి ఈ సంవత్సరం జనవరిలో కాశ్మీర్‌లోకి చొరబడ్డాడు. రెహమాన్‌కు బారాముల్లా, సోపోర్, వాటి పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతను నియమించే బాధ్యతను అప్పగించారు. వీరు అయిదుగురు కలిసి స్థానిక యువతద్వారా భారీ ఆత్మాహుతి దాడి నిర్వహించడానికి పథకం రూపొందిస్తున్నారు. ఈ పనిలో భాగంగా రెహమాన్ ఏడుసార్లు బారాముల్లా వచ్చాడు.

‘వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?’

రాష్టప్రతి కార్యాలయానికి సిఐసి ఆదేశం

న్యూఢిల్లీ, మే 15: రాష్టప్రతి హోదాలో ప్రతిభా పాటిల్‌కు వచ్చిన బహుమతులను మహారాష్టల్రోని అమరావతిలో ఆమె కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలకు ఇచ్చేందుకు అనుమతించిన అధికారులపై చేపట్టిన చర్యలు ఏమిటో వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ రాష్టప్రతి కార్యాలయాన్ని ఆదేశించింది. రాష్టప్రతిగా ప్రతిభా పాటిల్‌కు అందుకున్న బహుమతులను అమరావతిలోని విద్యా భారతి శిక్షణిక మండల్ పాఠశాలకు ఇచ్చేందుకు అనుమతించిన అధికారులపై ఏమి చర్యలు చేపట్టారన్న దానిపై ‘పూర్తి సమాచారాన్ని’ అందజేయాలని కోరుతూ సుభాష్ అగర్వాల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద దరఖాస్తు చేయడంతో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్‌కె.మాథుర్ ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రతిభా పాటిల్ రాష్టప్రతిగా ఉన్నప్పుడు అందుకున్న 155 బహుమతులను ప్రదర్శన నిమిత్తం తాత్కాలికంగా ఆ పాఠశాలకు ఇవ్వడం జరిగిందని, ఈ బహుమతుల్లో బ్రిటన్ ప్రధాన మంత్రి బహూకరించిన క్యాండిల్ సెట్, నెల్సన్ మండేలా బహూకరించిన స్వర్ణ, రజత పతకాలు, చైనా బహూకరించిన గిఫ్ట్ బాక్సు ఉన్నాయని గతంలో సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక అప్పీలుకు రాష్టప్రతి భవన్ సమాధానమిచ్చింది. రాష్టప్రతి భవన్‌కు, విద్యా భారతి శిక్షణిక మండల్‌కు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఎంఓయు) మేరకే వీటిని ఆ విద్యా సంస్థకు ఇవ్వడం జరిగిందని, అయితే ఆ విద్యా సంస్థ 2013 మే 22వ తేదీన ఈ బహుమతులన్నింటినీ తిరిగి రాష్టప్రతి భవన్‌కు అందజేసిందని రాష్టప్రతి కార్యాలయం పేర్కొంది.