జాతీయ వార్తలు

3 రాష్ట్రాల్లో నేడే పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/తిరువనంతపురం, మే 15: తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటుగా పుదుచ్చేరి అసెంబ్లీలకు సోమవారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుత ముఖ్యమంత్రులు జయలలిత, ఊమన్ చాందీలతోపాటుగా వారి ప్రధాన ప్రత్యర్థులు, రాజకీయ కురువృద్ధులు కరుణానిధి, విఎస్ అచ్యుతానందన్‌ల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ నెల 19న జరుగుతుంది. దీంతో ‘మినీ సాధారణ ఎన్నికలు’గా అభివర్ణించే ఈ ఎన్నికల్లో రెండు నెలల పాటు సాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడుతుంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలో తన ఉనికిని చాటుకోలేక పోతున్న బిజెపి ఈ సారి ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని గట్టి ప్రయత్నమే చేస్తుండడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ కూటముల మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న వారిలో అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, 91 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధే కాకుండా డిఎండికె-పిడబ్ల్యుఎఫ్- టిఎంసి కూటమికి చెందిన విజయకాంత్, పిఎంకెకు చెందిన అన్బుమణి రాందాస్ కూడా బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 244 స్థానాలకుగాను సోమవారం 233 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి నియోజకవర్గంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఇసి అక్కడ ఎన్నికను ఈ నెల 23కు వాయిదా వేసింది.
కేరళలో ఈసారి ఓటర్లు యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్‌లలో ఏ కూటమికి పట్టం కడతారో తెలియని పరిస్థితి ఉంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరాలని బిజెపి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ ఏ కూటమి ఓట్లను ఎక్కువ చీలిస్తే ఆ కూటమి అధికారానికి దూరమైనట్లేనని పరిశీలకుల అంచనా. 140 అసెంబ్లీ స్థానాలకోసం 109 మంది మహిళలతోసహా మొత్తం 1203 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో 344 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇక్కడ బహుముఖ పోటీలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి, ఏఐఎన్‌ఆర్‌సి వ్యవస్థాపకుడు ఎన్ రంగస్వామి, ప్రతిపక్ష నాయకుడు వి వైద్యలింగం (కాంగ్రెస్), అన్నాడిఎంకెకు చెందిన కణ్ణన్‌ల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడు రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 23 అసెంబ్లీ స్థానాలుండగా, దీనిలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌లోని యానాం, కేరళలోని మాహేలలో ఒక్కోస్థానం, కారైకల్‌లో అయిదు అసెంబ్లీ స్థానాలున్నాయి.