జాతీయ వార్తలు

భారత్-జపాన్ బంధంలో కొత్త శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/వారణాసి, డిసెంబర్ 11: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహిత మిత్రుడిగా భావిస్తున్న జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటనార్థం శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఆయన పర్యటన కాలంలో ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. 98వేల కోట్ల రూపాయలతో చేపట్టే తొలి బులెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం ఈ ఒప్పందంలో కీలకమైంది. ఇద్దరు ప్రధానుల మధ్య అణు ఒప్పందం సహా అనేక అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. భారత్ - జపాన్ తొమ్మిదో వార్షిక శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకుని షింజో అబే ఇక్కడకు వచ్చారు. గత ఏడాది కాలంలో రెండు దేశాలు తీసుకున్న నిర్ణయాల అమలును ఈ సందర్భంగా సమీక్షిస్తారు. షింజో అబేను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కలుసుకుని అనేక అంశాలపై చర్చించారు. షింజో అబే అద్భుతమైన నాయకుడనీ ఆయన రాకను పురస్కరించుకుని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి దోహదం చేయగలదన్న ఆశాభావాన్ని ట్వీట్‌లో వ్యక్తం చేశారు.
మోదీతో కలిసి నేడు వారణాసికి
ప్రధాని నరేంద్ర మోదీ తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి జపాన్ ప్రధాని షింజో అబేను శనివారం తీసుకువెళ్తున్నారు. ఈ పరిణామాన్ని ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా సాగుతున్న సంబంధాల్లో కొత్త మలుపుగా భావిస్తున్నారు. మోదీతో కలిసి గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం గంగానది ఒడ్డున పూర్తిస్థాయి భద్రతతో ఓ తాత్కాలిక వేదికను ఏర్పాటుచేశారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ వేదికనుంచే ఇద్దరు ప్రధానులు దశాశ్వమేథ ఘాట్‌లో జరిగే ప్రకృతిశోభిత గంగా హారతిని తిలకించనున్నారు. ‘కాశీ-క్యోటో ఒప్పందం’లో భాగంగా వారణాసి అభివృద్ధికి జపాన్ ఆర్థిక సహాయం అందించనుంది.