జాతీయ వార్తలు

‘నీట్’ ఏడాది వాయిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: మెడికల్, డెంటల్ కాలేజిల్లో ప్రవేశాలకు ‘నీట్’ను ఏకైక ప్రవేశపరీక్షగా చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏడాదిపాటు వాయిదా వేయడానికి ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలియజేశాయి. సుప్రీంకోర్టు తీర్పు అమలును 12 నెలల పాటు వాయిదా వేయడానికి ఆర్డినెన్స్‌ను తీసుకు రావాలని కేంద్రం యోచిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా ఒక తుది నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ రాష్ట్రాలు తమ సొంత ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించడానికి వీలు లేకుండా చేస్తూ, జాతీయ అర్హత కమ్ ఎంట్రన్స్ పరీక్ష (నీట్)ను ఒక్కటే అడ్మిషన్లకు ప్రాతిపదికగా ఉండాలని పేర్కొంటున్న సుప్రీంకోర్టు తీర్పు అమలును వాయిదా వేయాలంటే అర్డినెన్స్‌ను తీసుకు రావడమొక్కటే మార్గమని ప్రభుత్వంలోని ఒక వర్గం అభిప్రాయ పడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఆర్డినెన్స్ తీసుకు వస్తే సరిపోతుందా, లేక చట్టం చేయాల్సిన అవసరం ఉందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బుధవారం ఉదయం జరగబోయే కేంద్ర మంత్రివర్గం సమావేశంలో చర్చించబోయే అంశాల్లో దీన్ని చేర్చలేదు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటుగా పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును ఏడాది పాటు వాయిదా వేయడానికి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది చాలా ప్రధానమైన అంశంగా గుర్తించిన కేంద్రం కూడా దీనిపై సోమవారం చర్చల ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే.