జాతీయ వార్తలు

బిజెపికి నో ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 17: రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఒక సీటును బిజెపికి కేటాయించే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి లభించే మూడు రాజ్యసభ సీట్లలో నుండి ఒక సీటును బిజెపికి ఇస్తారా? అన్న విలేఖరి ప్రశ్నకు ఆయన తడుముకోకుండా అలాంటి ప్రతిపాదన ఏమీ తమ పరిశీలనలో లేదని అన్నారు. రాజ్యసభకు పార్టీ తరపున తెలంగాణా నాయకుడిని రాజ్యసభకు పంపిస్తారా? అన్న మరో ప్రశ్నకు నేరుగా జవాబివ్వకుండా దాటవేశారు.
ఇదిలా ఉంటే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సాయంత్రం ఏపి భవన్‌కు వచ్చి చంద్రబాబుతో పది నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిన కాసేపటికే విలేఖరుల సమావేశంలో బిజెపికి సీటు ఇచ్చే ప్రతిపాదన లేదని చెప్పటం గమనార్హం. కాగా తెలంగాణాకు చెందిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఏపి భవన్‌కు వచ్చి చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడి వెళ్లారు.