జాతీయ వార్తలు

భారత మ్యాప్‌పై పాక్ అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను భారత్‌లో అంతర్భాగాలుగా చూపుతూ కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘్భగోళిక సమాచార క్రమబద్దీకరణ బిల్లు’పై పాకిస్తాన్ తీవ్రంగా అశ్యంతరం చెప్పింది. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ బిల్లులో జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను తమ దేశ భూభాగాలుగా చూపించిందని.. అవి వివాదాస్పద ప్రాంతాలే తప్ప భారత భూభాగాలు ఎంతమాత్రం కావని పాక్ పేర్కొంది. ఈరకంగా ముసాయిదా బిల్లును రూపొందించటం అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘించినట్లేనని కూడా వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన తీవ్ర ఆందోళనను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, అధ్యక్షుడు, భద్రతామండలికి తమ శాశ్వత ప్రతినిధి ద్వారా ఫిర్యాదు చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘ ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ తన అధికారిక మ్యాప్‌లో జమ్ముకశ్మీర్‌ను తన అంతర్భాగంగా పేర్కొంటోంది. ఇది తప్పు. చట్టప్రకారం ఆమోదయోగ్యం కానిదని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను గౌరవించేలా భారత్‌కు తగిన సూచనలివ్వాలని పాక్ అంతర్జాతీయ సంస్థను కోరింది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్ముకశ్మీర్‌ను పాక్‌లో భాగంగా, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో భాగంగా పేర్కొంటూ వివాదాస్పద మ్యాపులు రావటంతో మోదీ ప్రభుత్వం అధికారికంగా తాజా మ్యాప్‌నకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో జియోస్పేషియల్ బిల్లుపై పాకిస్తాన్ ఐరాస జోక్యాన్ని కోరటంపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘ఇది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. పాకిస్తాన్‌కు కానీ మరో సంస్థ లేదా దేశానికి ఈ విషయంలో తలదూర్చే అధికారం ఎంతమాత్రం లేదు’ అని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు. ‘ప్రతిపాదిత బిల్లు పూర్తిగా భారత శాసన వ్యవస్థకు సంబంధించిన వ్యవహారుం. జమ్ము కశ్మీర్ భారత్‌లో అంతర్గత భాగమైనప్పుడు ఇక పాకిస్తాన్‌కు కానీ, ఇతర పార్టీలకు కానీ జోక్యం చేసుకునే వీలు లేదు. పాకిస్తాన్ పదే పదే అంతర్జాతీయ సమాజాన్ని భారత వ్యవహారాల్లో చొరబరచేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ మాత్రం ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని చూస్తోంది.’ అని వికాస్ స్వరూప్ అన్నారు.