జాతీయ వార్తలు

ఆర్‌బిఐ గవర్నర్‌ను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్‌పై బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజన్ పరిపూర్ణుడైన భారతీయుడు కాదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్‌బిఐ గవర్నర్ పదని నుంచి ఆయనను తొలగించాలని మంగళవారం ఇక్కడ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి స్వామి లేఖ రాశారు. రఘురాం రాజన్ దేశంలో గ్రీన్ కార్డుపై ఉన్నారు. కాబట్టి ఆయన పరిపూర్ణుడైన భారతీయుడుకాదు. రాజన్ నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని బిజెపి ఎంపీ వ్యాఖ్యానించారు. దేశంలో ఎంతోమంది ప్రతిభావంతమైన, జాతీయ భావాలున్న వారున్నారని, వారినే ఆర్‌బిఐ గవర్నర్ పదవిలో నియమించాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. యుపిఏ ప్రభుత్వం నియమించిన రఘురాం రాజన్‌ను ఇంకా కొనసాగించడం సరైందికాదు, తక్షణం ఆయనను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 2013లో యుపిఏ ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితితో రాజన్‌ను నియమించిందని ఆయన గుర్తుచేశారు. అమెరికా ప్రభుత్వ గ్రీన్‌కార్డు కలిగి ఉన్న ఆర్‌బిఐ గవర్నర్ దేశ ఆర్థిక ప్రయోజనాలను ఎలా నెరవేరుస్తారని బిజెపి ఎంపీ ప్రశ్నించారు. సోమవారం ఇక్కడో కార్యక్రమానికి హాజరైన ఆర్థిక మంత్రి జైట్లీ ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ పదవీకాలం పొడిగింపుపై అడిగిన ప్రశ్నకు బదులివ్వడానికి నిరాకరించారు. స్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. స్వామి అసలు టార్గెట్ ఆర్థిక మంత్రి జైట్లీ అని, అయితే ఆయనపై ప్రత్యక్ష దాడిని పక్కనబెట్టి ఆర్‌బిఐ గవర్నర్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.