జాతీయ వార్తలు

అవన్నీ ఊహాగానాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్/అహ్మదాబాద్, మే 17: గుజరాత్ ముఖ్యమంత్రిగా వేరొకర్ని నియమించేందుకు బిజెపి కసరత్తు చేస్తోదంటూ వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి ఆనందిబెన్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదనీ, ఈ పుకార్లన్నీ ఊహాగానాలేనని ఆమె స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు విచ్చేసిన సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆనందిబెన్ పైవిధంగా స్పందించారు. ఉజ్జెయినిలో జరుగుతున్న సింహస్థ కుంభ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆనందిబెన్, ఆధ్యాత్మిక గురువు భయ్యు మహరాజ్‌ను కలుసుకున్నారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ గుజరాత్ ముఖ్యమంత్రిని మారుస్తున్నారంటూ వచ్చిన పుకార్లు మీడియా పుణ్యమేనని అన్నారు. అయినా ప్రస్తుతం నేను ఇండోర్‌లో ఉన్నాను అంటూ చమత్కరించారు. ఈ పుకార్లకు ఆస్కారమిచ్చిన రెండు పర్యటనలను ఆమె విలేఖరులకు వివరించారు. నీటి సంక్షోభంపై చర్చించేందుకు తాను ఢిల్లీ వెళ్లానని, ‘నీట్’పై చర్చించేందుకు నితిన్‌భాయ్ ఢిల్లీ వెళ్లారని, ఈ రెండు పర్యటనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ఊహాగానాలకు మీడియా తెరదీసిందని ఆనందిబెన్ తెలిపారు. పటేళ్ల కోటా ఉద్యమ సమయంలో సరిగా వ్యవహరించలేదనే కారణంతోనే మిమ్ములను మారుస్తున్నారా అని విలేఖరులు అడగ్గా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యమం జరగడం లేదని, అది పూర్తిగా ఆగిపోయిందని బదులిచ్చారు. కాగా, 2017 ఎన్నికలను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ఆనందిబెన్ స్థానంలో ఆరోగ్యమంత్రి నితిన్ పటేల్‌కు పగ్గాలు అప్పగించనున్నారని వార్తలు వెలువడిన విషయం విదితమే.