జాతీయ వార్తలు

లొంగిపోయిన బిహార్ ఎమ్మెల్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ, మే 17: బిహార్‌లో జెడియు సస్పెండ్ ఎమ్మెల్సీ మనోరమ దేవి మంగళవారం ఎట్టకేలకు లొంగిపోయారు. మద్య నిషేధ చట్టం ఉల్లంఘించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మనోరమను 14 రోజుల జుడీషియల్ కస్టడికి పంపుతూ గయ జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిని ఎమ్మెల్సీ కొడుకు రాకీ యాదవ్ కాల్చి చంపేశాడు. రాకీకోసం ఎమ్మెల్సీ ఇంట్లో పోలీసులు గాలించగా విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. మనోరమ దేవి వారం రోజుల నుంచి అజ్ఞాతంలో ఉండగా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. వారం రోజులు కనిపించకుండా పోయిన ఎమ్మెల్సీ గయ జిల్లా కోర్టులో లొంగిపోయారు. జుడీషియల్ కస్టడీకి వెళ్తూ మీడియాతో మాట్లాడిన మనోరమ బిజెపిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ కక్షతోనే బిజెపి నేతలు తనను కేసులో ఇరికించారని ఆమె వాపోయారు. తన ఇంట్లో మద్యం బాటిళ్లు కొనుగొన్నారన్నది వట్టి అవాస్తవమని, ఇదంతా బిజెపి చేసిన కుట్రగా ఆమె ఆరోపించారు. ఇలావుండగా ముందస్తు బెయిల్‌కోసం ఎమ్మెల్సీ చేసుకున్న పిటిషన్ ఈ నెల 19న విచారణకు రానుంది. రాకీ యాదవ్ కజిన్ టినీ యాదవ్ కూడా మంగళవారం కోర్టులో లొంగిపోగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అరెస్టు వారెంట్ జారీ అయిన వెంటనే ఈ నెల 13న మనోరమ దేవి ముందస్తు బెయిల్‌కోసం కోర్టును ఆశ్రయించారు. గత వారమే ఆమె నివాసాన్ని గయ పోలీసులు సీజ్ చేశారు. కారుని ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఆదిత్య సచ్‌దేవ అనే యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి మరణానికి కారణమైన ఎమ్మెల్సీ కొడుకు రాకీ యాదవ్, ఆమె భర్త బింది యాదవ్‌లను పోలీసులు ఇంతకుముందే అరెస్టు చేశారు.

మంగళవారం గయ కోర్టులో లొంగిపోయన మనోరమ