జాతీయ వార్తలు

పథకాలు ఎన్నో.. ఆకట్టుకున్నవి కొనే్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక పథకాలు ప్రవేశపెట్టనప్పటికీ జన్‌ధన్, స్వచ్ఛ్భారత్ లాంటి కొన్ని పథకాలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించగా, మిగతా పథకాలేవీ వారి దృష్టిలో పడనే లేదని సిఎంఎస్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. 2014 మేలో మోదీ అధికారం చేపట్టినప్పటినుంచి దాదాపు 40 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలకు కొత్తరూపం, కొత్త పేర్లతో ప్రవేశపెట్టనవి కూడా వీటిలో ఉన్నాయి. ఈ పథకాలకు ప్రచారం కల్పించడానికి ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న 40 పథకాల్లో 25 పథకాల గురించి దేశ ప్రజల్లో మూడు శాతం మందికి కూడా తెలియదని ఆ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 25 శాతం మంది గుర్తించిన పథకాలు ఆరేడు మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిలో జన్‌ధన్ యోజన, స్వచ్ఛ్భారత్, అటల్ పెన్షన్ స్కీమ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలాంటివి ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉందనే దానితో సంబంధం లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రజల దృష్టిని ఆకర్షించిన పథకాలు ఏవయినా ఉన్నాయంటే అవి స్వచ్ఛ భారత్, జన్‌ధన్ యోజన మాత్రమే. ప్రధాని మోదీ ఆలోచనల్లో పుట్టిన అయిదు పథకాల్లో స్మార్ట్‌సిటీ, స్టార్టప్ ఇండియా, చివరికి బులెట్ ట్రైన్‌కన్నా కూడా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాలే ఎక్కువమంది దృష్టిని ఆకట్టుకున్నాయి.
స్థానిక సభ్య సమాజం ప్రమేయం ఉన్న, యువకులు మొదలుకొని వృద్ధుల దాకా అన్ని వయసు గ్రూపులవాళ్లు పాలు పంచుకున్న, క్షేత్రస్థాయిలో కంటికి కనిపించే పథకాలు మాత్రమే దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకట్టుకున్నాయని సిఎంఎస్ తన సర్వేలో స్పష్టం చేసింది. అలాగే ఉపాధి అవకాశాలు కలిగిన, సమూలమైన మార్పును తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉండే పథకాలు మాత్రమే ముందు వరసలో నిలిచాయని ఆ సర్వే పేర్కొంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పెద్దగా పురోగతి లేని పథకాల్లో మైనార్టీలకు ఆర్థిక సహాయం అందించే పథకం, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, వికలాంగుల పింఛను పథకం, మరుభూమి వికాస్ యోజన, భూ సారానికి సంబంధించిన వివరాలు తెలియజేసే మట్టి నమూనా కార్డు, బాల వికాస్ యోజన, నమామి గంగే లాంటివి ఉన్నాయి. సర్వేలో వెల్లడయిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ప్రధానమంత్రి పదం ముందు జోడించినప్పటికీ కొన్ని పథకాలు పురోగతి సాధించక పోవడం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై పథకాల్లో ఎనిమిది పథకాలు ప్రధానమంత్రి పేరుతో ప్రారంభమవుతున్నాయి. అయితే గ్రామీణ సడక్ యోజన, రోజ్‌గార్ యోజన తప్ప మిగతా పథకాలు ఏవీ కూడా పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి, వాటి అమలు గురించి ప్రజల్లో ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవడం కోసం ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే కోసం సిఎంఎస్ 4000 వేల మందిని ప్రశ్నించింది.