అంతర్జాతీయం

మహా ఓడ ..ఈఫిల్ టవర్ కంటే ఎత్తయన క్రూయిజ్ హార్మనీ ఆఫ్ సీస్ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓడ పేరు - హార్మనీ ఆఫ్ సీస్
బరువు - 1,20,000 టన్నులు
వెడల్పు - 66 మీటర్లు (217 అడుగులు)
ఎత్తు - 362 మీటర్లు
(ఈఫిల్ టవర్ కంటే 50మీటర్లు ఎక్కువ)
అంతస్థులు - 16
ప్రయాణికులు - 6360
సిబ్బంది - 2100
నిర్మాణ ఖర్చు - 100 కోట్ల డాలర్లు

లండన్, మే 17: సాగర జలాలపై మహాద్భుతం ఆవిష్కారమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తు.. ఇంకా చెప్పాలంటే విశ్వ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ కంటే కూడా 50 మీటర్ల ఎత్తులో.. ఆకాశాన్ని అలవోకగా అందుకుంటున్నట్లుగా కనిపించే అపూర్వమైన మహా ఓడ మంగళవారం బ్రిటన్‌లోని సౌతాంప్టన్ ఓడరేవులో వేలమంది ప్రజల్ని అబ్బురపరుస్తోంది. ‘హార్మనీ ఆఫ్ సీస్’ అన్న పేరు గల ఈ ఓడ బరువు అక్షరాలా లక్షా ఇరవై వేల టన్నులు..ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ తీరంలోని సెయింట్ నజైర్ షిప్‌యార్డ్‌లో దాదాపు వంద కోట్ల డాలర్ల ఖర్చుతో తయారైన ఈ ఓడను మంగళవారం ఫ్రాన్స్ నుంచి బ్రిటన్ సౌతాంప్టన్ తీరానికి తీసుకువచ్చారు. దాదాపు 70వేల మంది ప్రజలు సాగర తీరం వెంబడి ఈ మహా ఓడను చూసినట్లు అధికారులు తెలిపారు. జూన్ నెలలో ఈ ఓడ తన తొలి ప్రయాణం చేయనుంది.