జాతీయ వార్తలు

భారత్, చైనాలు కలిస్తే తిరుగే ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ఉగ్రవాదంపై పోరులో చైనా గనుక భారత్‌తో చేతులు కలిపితే దాని ప్రభావమే వేరుగా ఉంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాద జాబితాలో ఉంచడానికి జరిపిన యత్నాలను చైనా ఇటీవల అడ్డుకున్న నేపథ్యంలో రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘్భరత్, చైనాలు రెండూ చాలా పెద్ద దేశాలు. బహుళ సంస్కృతులు, బహుళ జాతులు ఉన్న దేశాలు. ఈ రెండూ గనుక ఉగ్రవాదంపై పోరులో ఒక్కటయితే దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు, ప్రతి దేశం కూడా ఉగ్రవాదం విషయంలో లేశమాత్రం కూడా సహించని విధానాన్ని అనుసరించాలని, దానిపై పోరాటం కూడా పూర్తిస్థాయిలో ఉండాలని భారత్ ఎప్పుడూ నమ్ముతుంది’ అని వచ్చే వారం చైనాలో తన పర్యటనకు ముందు చైనా ప్రభుత్వ టీవీ చానల్ సిసిటీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రణబ్ అన్నారు.
2001 పార్లమెంటుపై దాడి, ఈ ఏడాది పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారు, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడైన మహమ్మద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడానికి ఐక్యరాజ్య సమితిలో జరిగిన ప్రయత్నాలను చైనా ఈ ఏడాది మార్చిలో అడ్డుకున్న విషయం తెలిసిందే. కాగా, భారత్, చైనా దేశాల మధ్య సమగ్రమైన సంబంధాలున్నాయని, చైనాతో సంబంధాలను భార త్ అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తుందని రాష్టప్రతి చెప్పారు. తన పర్యటనపై మాట్లాడుతూ ‘రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి ఉన్న అవకాశాలను అనే్వషించడానికి ఇది ఒక అవకాశం కల్పిస్తుంది. అంతేకాక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపైన వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు’ అని రాష్టప్రతి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని గత మార్చిలో చైనా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీని కోరింది. అయితే అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించని పక్షంలో జైషే మహమ్మద్, దాని నాయకుడినుంచి తమకు, దక్షిణాసియాలోని ఇతర దేశాలకు ముప్పు ఉంటుందని భారత్ వాదించింది. ఐక్యరాజ్య సమితి 2001లోనే జైషే మహమ్మద్ సంస్థను నిషేధించింది.

విపత్తులను ఎదుర్కొందాం

రాష్ట్రాలకు కేంద్రం పిలుపు

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మే 18: ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. వైపరీత్యాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన సమగ్ర చర్యలను సూచించడంతోపాటు, వాటివల్ల కలిగే నష్టాన్ని తగ్గించే అవకాశాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కేంద్రం నిర్దేశించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి అధ్వర్యంలో రాష్ట్రాల రిలీఫ్ కమిషనర్లు, విపత్తు నిర్వహణ ప్రిన్సిపల్ కార్యదర్శులతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలు, కేంద్రం అందించాల్సిన సాయంపై చర్చించారు. ప్రతి ఏడాది రుతుపవనాల ప్రారంభానికి ముందు జాతీయ విపత్తు నిర్వహణ సమావేశం నిర్వహిస్తారు. దేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల వైపరీత్యాలు పెరుగుతున్నాయని, వాటివల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి పిలుపునిచ్చారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలన్నీ వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రిలీఫ్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో తప్ప వేరే జిల్లాల్లో తుపాను తాకిడి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న కరువు సమస్య నుంచి త్వరలోనే బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరదలు, తుపానులు మామూలేనని, వాటిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని ఏపీ రిలీఫ్ కమిషనర్ ధనుంజయ్ రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ ఇచ్చే అంచనాలను బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకోస్తామన్నారు.

జాతీయ స్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్ లాగే రాష్టస్థ్రాయిలో ఎన్డీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేశామని, అందుకుగాను 23కోట్లతో పరికరాలను కొనుగోలు చేయబోతున్నామని వివరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న
కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి