అంతర్జాతీయం

కుదరని ఏకాభిప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీ బౌర్గెట్, డిసెంబర్ 11: కర్బన ఉద్గారాలకు సంబంధించిన నిబంధనలు, నిధులు లాంటి అంశాలకు సంబంధించి వివిధ దేశాల మధ్య విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ మిగతా కీలక అంశాలపై పురోగతి ఉన్న ముసాయిదాపై ఒక ఒప్పందాన్ని సాధించడానికి అదనంగా మరో రోజు అంటే శనివారం కూడా సమావేశం కావాలని వాతావరణ మార్పులపై ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ సమావేశం నిర్ణయించింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య తేడాను నిర్ణయించడం ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కారణంగా దెబ్బతిన్న దేశాలకు ఆర్థిక సహాయం అందించడంలాంటి క్లిష్టమైన అంశాలపై చర్చలు జరుపుతున్న వారు ఒక ఉమ్మడి అభిప్రాయానికి రావడం కోసం శుక్రవారం చర్చలను అనుకున్న దానికన్నా ఎక్కువ సేపే కొనసాగించారు. ‘నేను ముందు అనుకున్నట్లుగా శుక్రవారం సాయంత్రం ఒప్పందం పాఠాన్ని సమర్పించబోవడం లేదు, శనివారం ఉదయం సమర్పిస్తాను’ అని శిఖరాగ్ర చర్చలకు ఆతిథ్యం వహిస్తున్న ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ స్థానిక టీవీకి చెప్పారు. ‘చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.. చర్చలు సరైన దిశలో ముందుకు సాగుతున్నాయి’ అని శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షుడు కూడా అయిన ఫాబియస్ బిఎఫ్‌ఎం టీవీలో అన్నారు. అంతేకాదు వాతావరణం బాగుందని, పరిణామాలు సానుకూలంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. ‘రాత్రి పొద్దుపోయే దాకా కూడా చర్చలు జరుపుతున్న వాళ్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. రోజంతా అనధికారిక చర్చలు కొనసాగుతాయి. రేపు ఉదయం ఒప్పందం వివరాలు సిద్దం కావచ్చు’ అని చర్చల్లో పాల్గొంటున్న ఒక దౌత్యవేత్త చెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాత గురువారం రాత్రి భారత్ లాంటి దేశాలు లేవనెత్తిన కీలక అంశాలను చేరుస్తూ కొత్తగా, కుదించిన ఒక ముసాయిదాను ఖరారు చేయడం జరిగింది. అయితే దాదాపు రెండు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య కొనసాగుతున్న విభేదాలు రాత్రంతా చర్చలు కొనసాగినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. కర్బనపు ఉద్గారాలను అదుపు చేయగల ఒక ఒప్పందానికి సమావేశంలో పాల్గొంటున్న మొత్తం 195 దేశాలు ఒక అంగీకారానికి వస్తాయనే ఆశ కలుగుతోంది. కాగా, ఇంతకు ముందున్న ముసాయిదాకన్నా రెండు పేజిలు తక్కువగా 27 పేజీలకు కుదించిన కొత్త ముసాయిదాలోమన దేశం లేవనెత్తిన అనేక కీలక అంశాలను చేర్చడం జరిగింది. అయితే ఇప్పటికీ చాలా ముఖ్య అంశాల విషయంలో ఇబ్బందులున్నట్లు తెలుస్తోంది.