రాష్ట్రీయం

ఇక పోస్టల్ బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: వచ్చే ఏడాది మార్చి నుంచి పోస్టల్ పేమెంట్ (లావాదేవీ) బ్యాంకులు ప్రారంభమవుతాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మహిళల రక్షణకు మొబైల్ ఫోన్లలో ‘ప్యానిక్ బటన్’, జిపిఎస్ వంటి విప్లవాత్మకమైన మార్పులు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రాబోతున్నాయని ఆయన చెప్పారు. ఆదివారం ఇక్కడ తపాలా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టుమ్యాన్‌లకు 1.30 లక్షల నెట్‌వర్క్ ఉన్న పరికరాలు ఇవ్వనున్నామని, దీంతో బ్యాంకింగ్, ఇన్సూరెన్సులు, మెయిల్ వంటి లావాదేవీలను సులభంగా చేయడానికి వీలుంటుందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వీటిని తొలుత ఆరు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నామన్నారు. కోర్ బ్యాంకింగ్ చాలా ముఖ్యమైనదని, దీన్ని 230 పోస్టల్ శాఖలకు విస్తరించామని అన్నారు. కన్యా సమృద్ధి యోజన, బేటీ బచావో, భేటీ పడావో పథకం ద్వారా వెయ్యి రూపాయలు జమ చేస్తే వివాహా వయస్సు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు చెల్లించనున్నట్లు చెప్పారు. పోస్టల్‌లో 85 లక్షల అకౌంట్లకు పెరిగిందని, అన్ని బ్యాంకుల్లో 4 లక్షల అకౌంట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.
హెచ్-1బి, ఎల్1 వీసా..
హెచ్-1బి, ఎల్1 వీసాల ఫీజుల పెంపుగురించి అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతామని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే అమెరికా అధ్యక్షునితో మాట్లాడారన్నారు. మహిళలు ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే తన కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించేందుకు మొబైల్ పోన్లలో ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పదిహేను, ఇరవై సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న పోస్టుమెన్లను పర్మినెంట్ చేసే విషయం పరిశీలిస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చిత్రం... తపాలాశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రవిశంకర్ ప్రసాద్