జాతీయ వార్తలు

స్మార్ట్ సిటీగా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీ) జాబితాలో వరంగల్‌కు చోటులభించింది. రెండో విడతలో 13 స్మార్ట్ సిటీస్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ప్రకటించారు. స్మార్ట్ సిటీస్‌లో హైదరాబాద్‌కు బదులు కరీంనగర్‌కు స్థానం కల్పిచాలన్న అంశం పరిశీలనలో ఉందని, దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తొలిదశ స్మార్ట్ సిటీలో స్థానం లభించని నగరాలకు నిర్వహించిన ఫాస్ట్ ట్రాక్ పోటీ ఫలితాలను వెంకయ్య ప్రకటించారు. స్మార్ట్ సిటీల పథకంలో రాష్ట్ర రాజధానులకు చోటు కల్పించాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో పోటీలో పాల్గొనేందుకు ఏపీ కొత్త రాజధాని అమరావతి, పాట్నా, సిమ్లా, నయారాయ్‌పుర్, ఈటానగర్, బెంగళూరు, తిరువనంతపురాలకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 98 స్మార్ట్ సిటీలకుగాను రెండు దశల్లో 33 నగరాలు ఎంపిక చేశామని, ఈ ఏడాది మరో 27 నగరాలు ప్రకటిస్తామన్నారు. స్మార్ట్ సిటీస్ పథకం కింద పట్టణాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం మోదీ నేతృత్వంలోని కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఈ పథకం కింద ఐదేళ్ల ప్రణాళిక రూపొందించామని, పట్టణాల్లో మెరుగైన తాగునీటి వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారన్నారు. పట్టణాల్లో వౌలిక సదుపాయాల మెరుగుకు కేంద్రం సాయాన్ని రూ.1,13,143 కోట్లకు పెంచామన్నారు. 2004-2014 మధ్య ఈ కేటాయింపులు కేవలం 33,902 కోట్లు మాత్రమేనన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికే 6.84 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. రెండేళ్లలో పట్టణాభివృద్ధి పథకాలు, సాధించిన ఫలితాలను ‘పట్టణ పునరుజ్జీవం ’ పేరిట పుస్తకాన్ని కేంద్ర మంత్రి విడుదల చేశారు. రెండో జాబితాలో స్థానం లభించిన నగరాల్లో లక్నో, వరంగల్, ధర్మాశాల, చండీగఢ్, రాంచి, కోల్‌కతా న్యూటౌన్, బాగల్‌పూర్, పనాజీ, పోర్టుబ్లెయర్, ఇంఫాల్, ఫరీదాబాద్, అగర్తలా, రాయ్‌పుర్ ఉన్నాయి.
కెసిఆర్‌కు కృతజ్ఞతలు
స్మార్ట్ సిటీల్లో వరంగల్‌కు స్థానం కల్పించేందుకు కృషి చేసిన సిఎం కెసిఆర్‌కు వరంగల్ మేయర్ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం సిఎంను కలిసిన నరేందర్, కాకతీయ రాజధాని అయిన వరంగల్‌లో చారిత్రక పురాతన కట్టడాలు, వాటి అభివృద్ధికి కేంద్రం నిధులు త్వరితగతిన వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తరువాత ఐటి కేంద్రంగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం ఐటి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు స్మార్ట్ సిటీగా ప్రకటించడంతో వరంగల్ అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడ్డాయి. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మేయర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.