అంతర్జాతీయం

చైనాతో సయోధ్యకే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 24: ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకుంటూ..విభేదాలను సాధ్యమైనంత మేర తగ్గించుకోవడమే చైనాతో భారత మైత్రిలో కీలకాంశమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. నాలుగు రోజుల చైనా పర్యటనకు వచ్చిన రాష్టప్రతి గ్వాంగ్‌ఝులో భారత సంతతిని ఉద్దేశించి మాట్లాడారు.చైనాతో సహకారాన్ని విస్తరించుకునేందుకే భారత్ ప్రయత్నించింది తప్ప విభేదాలను పెంచుకోలేదని గుర్తు చేశారు. ఐరాస, ప్రపంచ బ్యాంక్,ఐఎమ్‌ఎఫ్ వంటి అంతర్జాతీయ వేదికల్లో ఇరు దేశాలు కలిపి పని చేయడమే వీటి మధ్య పెరుగుతున్న సహకారానికి, బలోపేతమవుతున్న ఏకాభిప్రాయానికి నిదర్శనమన్నారు.
కాగా, ప్రణబ్ ముఖర్జీ గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ఇతర అగ్రనేతలతో జరిపే చర్చల్లో అణు సరఫరా దేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వానికి చైనా వ్యతిరేకత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడానికి ఐక్యరాజ్య సమితి యత్నాలను అది అడ్డుకోవడం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ అంశాలపై భారత దేశ ఆందోళనను,ఈ అంశాల విషయాల్లో భారత దేశం అభిప్రాయాలను ప్రణబ్ చైనా నేతలు బలంగా వినిపించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ హోదాల్లో చైనాలో అనేక సార్లు పర్యటించిన ప్రణబ్ రాష్టప్రతి హోదాలో ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాష్టప్రతి గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరపడంతో పాటుగా ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఆయన చైనా ప్రధాని లీ కెక్వియాంగ్‌ను, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ జాంగ్ డెజియాంగ్‌ను కూడా కలవనున్నారు. చైనా నేతలతో రాష్టప్రతి జరిపే చర్చల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్య, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు కొనసాగుతున్న వ్యవస్థతో పాటుగా ఇరు దేశాలకు ఆసక్తి ఉన్న వివిధ అంశాలు చర్చకు రానున్నాయి.

కుమార్తె శర్మిష్ఠతో కలిసి చైనాలోని గ్వాంగ్‌ఝు విమానాశ్రయంలో దిగుతున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ