జాతీయ వార్తలు

కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: దేశంలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. మోదీ రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. కార్మికుల ఆరోగ్యం, సామాజిక భద్రత, పని దినాల కుదింపువంటిని మెరుగు పరచాలంటే చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్మికులకు పెన్షన్ 1000 రూపాయలకు పెంచడంతోపాటు, బోనస్ సిలింగ్‌ను రూ.3,500 నుంచి 7,000 పెంచినట్టు తెలిపారు. కాగా కార్మికులకు ఇపిఎఫ్ మొత్తం ఎలక్ట్రానిక్ పద్ధతి ద్యారా బ్యాంకు ఖాతాలో జమచేస్తామన్నారు. బీడీ కార్మికుల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే వ్యయాన్ని పెంచామని, గతంలో రూ. 40 వేలు ఇస్తే తాము లక్ష 20 వేలకు పెంచామని తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు బండారు వెల్లడించారు.