జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మైక్రోమాక్స్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్‌లలో దాదాపు 300 కోట్ల పెట్టుబడితో సెల్‌ఫోన్లను ఉత్పత్తి చేయాలని మైక్రోమాక్స్ సంకల్పిస్తోంది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతోనే దేశీయంగా వీటి ఉత్పత్తులను చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. కొత్త ఏడాదిలోనే ఈ మూడు రాష్ట్రాల్లో మూడు హ్యాండ్‌సెట్ల ఉత్పాదక కేంద్రాలను ప్రారంభిస్తామని మైక్రోమాక్స్ సహ సంస్థాపకుడు రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తమకు 20 ఎకరాలు కేటాయించిందని, రాజస్థాన్ ప్రభుత్వం కూడా 25 ఎకరాలు అందించినట్టు చెప్పారు.
సమీప భవిష్యత్‌లోనే హ్యాండ్‌సెట్ల ఉత్పాదక కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కో ప్లాంట్‌లోనూ 3వేల నుంచి 3.5వేల మందికి ఉపాధి కల్పించగలుగుతామని ఆయన వెల్లడించారు. మేకిన్ ఇండియాలో భాగంగానే తాము దేశీయంగా హ్యాండ్ సెట్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.