జాతీయ వార్తలు

ప్రతి భారతీయుడూ నిర్భయంగా జీవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 13: భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమని, ప్రతి వ్యక్తి ఎలాంటి భయాలు, అనుమానాలు లేకుండా జీవించినప్పుడే సామాజిక వ్యవస్థ బలంగా ఉంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ‘డయోసిస్ ఆఫ్ కలకత్తా’ ద్విశతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్టప్రతి మాట్లాడుతూ, ప్రతి మతం కూడా మానవతా విలువలనే బోధిస్తుందన్నారు. ‘క్షమాగుణం, సంయమనం, భిన్న అభిప్రాయాలను అంగీకరించడం అనేవి మన వౌలిక విలువల్లో కొన్ని. భిన్న సంస్కృతులు కలిగి ఉన్నందుకు భారత దేశం గర్విస్తోంది’ అని రాష్టప్రతి అన్నారు. భారత దేశంలో ఎన్నో మతాలు పరిఢవిల్లాయని, ఎందుకంటే అన్ని మతాలను తనలో ఇముడ్చుకునే శక్తి భారత దేశానికి ఉందని ఆయన అంటూ, రాబోయే తరాల్లో మన నాగరికతను నిర్ణయించేది అదేనని అన్నారు. ‘కులం, తెగ, మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా ప్రతి వ్యక్తీ ఎలాంటి భయం, అనుమానాలు లేకుండా జీవించగలిగినప్పుడు, ప్రగతిలో భాగస్వామి ఆయినప్పుడు మన సామాజిక వ్యవస్థ బలంగా ఉంటుంది’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఒక వ్యక్తిని కొట్టి చంపిన ఘటన, దేశంలో అసహనం పెరిగి పోతోందన్న వాదనలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్టప్రతి సహన శీలత, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలని ఇటీవల తరచూ పిలుపునిస్తున్న విషయం తెలిసిందే.