జాతీయ వార్తలు

కేరళ ముఖ్యమంత్రిగా విజయన్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మే 25: సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ బుధవారం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మరో 18 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 19మందితో కూడిన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు సహా 13మంది కొత్తవారే. అయిదుగురు మాత్రమే గతంలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికోసం పార్టీలో అంతర్గతంగా సాగిన రేసులో సీనియర్ నేత విఎస్ అచ్యుతానందన్‌పై పైచేయి సాధించిన 72 ఏళ్ల విజయన్‌తో గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) పి.సదాశివం ఇక్కడి సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయించారు. పేద గీతకార్మిక కుటుంబంలో పుట్టిన విజయన్ కేరళ 12వ ముఖ్యమంత్రిగా మలయాళంలో ప్రమాణస్వీకారం చేశారు. 19మంది మంత్రుల్లో ముఖ్యమంత్రి సహా 12మంది సిపిఐ(ఎం)కు చెందినవారు కాగా, నలుగురు సిపిఐకి చెందినవారు ఉన్నారు. ఎన్‌సిపి, జనతాదళ్(ఎస్), కాంగ్రెస్(ఎస్)ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర సచివాలయానికి పక్కన ఉన్న స్టేడియంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రమాణస్వీకారోత్సవానికి తరలివచ్చిన ప్రజలు తిలకించడానికి వీలుగా వివిధచోట్ల సిసిటివిలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ ప్రమాణస్వీకారోత్సవం మధ్యలో వర్షం పడినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు.
మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు ఊమెన్ చాందీ, విఎస్ అచ్యుతానందన్, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, 1957లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన 97 ఏళ్ల వృద్ధ నాయకురాలు కెఆర్ గౌరియమ్మ, బిజెపి నుంచి అసెంబ్లీలో ఎన్నికైన ఒ.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.