జాతీయ వార్తలు

ఆ పాపాలు నేను చేయలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావణగెరె (కర్నాటక), మే 29: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్ల కాలంలో 700కు పైగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వీటిలో కొన్ని పథకాలు అమలులోకి రాకపోయినా, చేపట్టిన ప్రయత్నాలు సఫలం కాకపోయినా ‘ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని తప్పుడు పథంలో ముందుకు వెళ్లనివ్వను’ అని ఉద్ఘాటించారు. అభివృద్ధి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడిక్కడ ఓ భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ రెండేళ్ల కాలంలో తన ప్రభుత్వ పనితీరును వివరించడంతోపాటు విమర్శలనూ తిప్పికొట్టారు. డీజిల్, పెట్రోలు సహా అనేక రకాల లాబీలకు గత ప్రభుత్వం తల వంచిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మోదీ ‘అలాంటి తప్పుడు మార్గాల్లో నేనెప్పుడూ వెళ్లను’ అని స్పష్టం చేశారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కార్యాలయం ఎలా ఉందో చూసుకోకముందే తన ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారని, తన పనితీరునే ప్రశ్నించడం మొదలైందని మోదీ వెల్లడించారు. ఇప్పటివరకూ తాను చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు అన్నీ కూడా రైతులకు, పేదలకు లబ్ధిని చేకూర్చేవేనని, అదే క్రమంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించామని చెప్పారు. కొన్ని పార్టీలు అహరహం ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడతాయని, కాని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనివ్వవని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధకారంలోకి రావడాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోయాయని తెలిపారు. ‘అసలు మోదీ అనేవాడు ఎక్కడినుంచి వచ్చాడని ఆ పార్టీలు విస్తుపోయాయి. నేను మీలో ఒకడిగానే ముందుకొచ్చాను. భారత పౌరుడిగానే వెలుగులోకి వచ్చాను’ అని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటూ వచ్చిన విమర్శలను కొట్టిపారేసిన మోదీ, ఈ రెండేళ్ల కాలంలో 700కు పైగా సంక్షేమ పథకాలను చేపట్టడానికి మించిన తార్కాణం అభివృద్ధికి ఏముంటుందని అన్నారు. తాను ఏ పని చేసినా ప్రజల క్షేమం కోసం, వారి సంక్షేమం కోసమేనని ఉద్ఘాటించారు. ‘కేవలం కొందరికే ప్రయోజనం కలిగించకపోవడం నేను చేసిన తప్పా.. వారి బాటలోనే నేను వెళ్లాలా?’ అని ప్రశ్నించారు. దేశ ప్రజలందరి ఆశీస్సులు తనకు ఉన్నప్పుడు పాపమార్గంలో వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్, ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు మరింత రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. వివిధ రంగాలలో తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించిన మోదీ, త్వరలోనే వీటి ఫలితంగా మార్పులు కనిపిస్తాయని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల మద్దతు మరింత అవసరమని అన్నారు. పంట బీమా పథకం, నీటి పారుదల పథకాలను రైతుల లబ్ధికోసమే చేపట్టామని తెలిపారు. అలాగే పేదలకోసం బ్యాంకు ఖాతాలు, బీమా పథకాలు అమలుచేశామన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో 5కోట్ల మంది పేదలకు ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చే దిశగా కూడా ముందుకు వెళుతున్నామన్నారు. చెరకు రైతులకు మిల్లు యాజమాన్యాలు సరైన సమయంలో చెల్లింపులు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే దేశంలో ఎక్కడైనా మరింత లాభంతో తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఈ-వేదికను రైతులకోసం ఏర్పాటు చేశామన్నారు. 1200కు పైగా ఉన్న కాలం చెల్లిన చట్టాలను రద్దుచేశామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్లాస్-3, క్లాస్-4 నియామకాలకు సంబంధించి ఇంటర్‌వ్యూ విధానాన్ని కూడా రద్దుచేశామని తెలిపారు.
chitram...
హుబ్లీ ఎయర్‌పోర్టులో నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న బిజెపి నాయకులు