జాతీయ వార్తలు

నిస్సంకోచంగా అసత్యమైనవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: నేషనల్ హెరాల్డ్ కేసుపై వివాదం తీవ్రమైన తరుణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, అశ్వినీకుమార్ ఆదివారం బాసటగా నిలిచారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసిన ఆరోపణలు, పరోక్ష నిందలు పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా పన్నినవేనని వారు పేర్కొన్నారు. సోనియా, రాహుల్ ఒక్క రూపాయి కూడా తీసుకోనప్పటికీ వారి ప్రతిష్ఠను దిగజార్చేందుకు నిస్సంకోచంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చిదంబరం, అశ్వని కుమార్ దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి జరిపిన అన్ని లావాదేవీలు చట్టబద్ధమైనవని వారు పేర్కొన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ న్యాయ ప్రక్రియ ద్వారా నిర్దోషులుగా తేలుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. నిజానికి లాభాపేక్ష లేని కంపెనీలో ఎక్కువ వాటాలను తీసుకోవడం ద్వారా ఆ కంపెనీకి చెందిన ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా ప్రైవేటు లబ్ధిదారులకు వెళ్లకుండా చూడగలిగామని పేర్కొంటూ, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) వాటాలను సోనియా, రాహుల్ ప్రధాన వాటాదారులుగా గల యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేయడాన్ని మాజీ ఆర్థిక మంత్రి కూడా అయిన చిదంబరం గట్టిగా సమర్థించారు. ఒక మూసివేసిన ప్రైవేటు ఫిర్యాదును తిరిగి తెరిపించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తొందరపడిందని ఆయన ఆరోపించారు. లాభాపేక్ష లేని కంపెనీ ప్రధాన వాటాదారు కావడం వల్ల ఎజెఎల్ ఆస్తులకు భద్రత రెట్టింపు అయిందని ఆయన అన్నారు.
కేవలం కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఇతరులను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు, పరోక్ష నిందలకు పాల్పడ్డారని అశ్వినీ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్ఠను దెబ్బతీయడానికి పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్రగా నేషనల్ హెరాల్డ్ కేసును ఆయన అభివర్ణించారు. ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 7న ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకిస్తూ ఎజెఎల్ వాటాల బదిలీ నేరపూరితం కాదని ఆయన పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ట్రయల్ కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరీ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్ 19న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ ఇద్దరు నేతలకు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది.