జాతీయ వార్తలు

‘హోదా’ తేలేక పారిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదానుండి తప్పించుకునేందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాజస్తాన్‌కు పారిపోయారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఆదివారం జరిగిన సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చిన నారాయణ సోమవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు. ‘రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పదు’ అన్నట్లు ప్రత్యేక హోదా వెంకయ్యను వెంటాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని మహానాడులో చేసే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకుండాపోయిందని దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనా కాలంలో కార్పొరేట్ సంస్థలకు లాభం కలిగింది తప్ప సామాన్యుడికి ఏమీ ఒరగలేదని విమర్శించారు. మోదీ పాలన దేశంలోని బీదలపట్ల శాపంగా మారిందని ఆరోపించారు. మోదీ మొదటి సంవత్సరం పాలనలో ఘర్ వాపసీ, రెండో ఏడాదిలో బీఫ్ వ్యవహరం తెరపైకి తీసుకోచ్చారని బిజెపి నాయకులపై మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి లక్షల కోట్ల ఆదాయం పెరిగినా తీవ్రకరువును ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం చేసిన సహాయం సున్నా అని నారాయణ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటంవల్ల వామపక్ష పార్టీలు బెంగాల్‌లో చావుదెబ్బతిన్నాయి, ఇది వామపక్షాలకు పెద్ద గుణపాఠమని నారాయణ అంగీకరించారు. పార్టీ ఫిరాయింపులతో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలన్నీ బురద పూసుకొంటున్నాయని ఆయన చెప్పారు. వైఎస్‌ఆర్, కేసిఆర్, చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో దిట్టలని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాలలో పోటీపడి ఎమ్మెల్యేలను కొంటున్నారని నారాయణ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నా ప్రజలు మాత్రం ఎప్పుడూ ప్రతిపక్షాలనే బలపరుస్తారని వాస్తవాన్ని అధికార పార్టీలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.