అంతర్జాతీయం

చర్చల నుంచి భారత్ పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 1: భారత్‌తో చర్చల కోసం తాము ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ, ఆదేశం నుంచి సానుకూల ప్రతిస్పందన రావడంలేదని.. చర్చల నుంచి భారత్ పారిపోతోందని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ విమర్శించారు. ‘్భరత్‌తో చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు పాకిస్తాన్ కృషి చేస్తున్నప్పటికీ, పఠాన్‌కోట్‌పై దాడి కేసులో సంయుక్త దర్యాప్తుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ భారత్ మాత్రం ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలకు ముందుకు రావడం లేదు. దీనిపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది’ అని ఆయన అన్నారు.
‘ప్రాంతీయ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం కాశ్మీర్ అంశమని మేము భావిస్తున్నాం. ఉపఖండం విభజన అజెండాలో పూర్తికాకుండా మిగిలిపోయిన అంశం కాశ్మీర్. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షకు, ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీర్మానానికి అనుగుణంగా కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించకుండా ఈ ప్రాంత సమస్యల పరిష్కారం సాధ్యం కాదు. అని ఆయన పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి బుధవారం చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ శాంతియుత దేశమని, అన్ని దేశాలతో సౌభ్రాతృత్వ, స్నేహ సంబంధాలను కలిగి ఉండే విదేశాంగ విధానాన్ని కోరుకుంటోందని హుస్సేన్ అన్నారు. ‘ఏ దేశం పట్ల కూడా దూకుడుగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. జాతీయ, ప్రపంచ వ్యవహారాలలో నిజాయితీగా పాల్గొనాలని కోరుకుంటున్నాం’ అని ఆయన అన్నారు. అన్ని పొరుగు దేశాలతో ఉన్న వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవడం ద్వారా శాంతియుత సంబంధాలను కొనసాగించాలని పాకిస్తాన్ కోరుకుంటోందన్నారు. భారత్ మాత్రం పాకిస్తాన్‌తో చర్చలకు ముందుకు రాకుండా తప్పించుకు తిరుగుతోందని ఆయన విమర్శించారు. ‘మన రాజకీయ వ్యవస్థ వివిధ రకాల సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొనగలిగేంత బలోపేతమయింది అంటే ప్రజాస్వామ్యం లేకుండా నిలకడైన అభివృద్ధి, స్థిరత్వం సాధించడం సాధ్యం కాదని మన దేశం నిర్ధారణకు వచ్చింది’ అని పాకిస్తాన్ అధ్యక్షుడు అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుత పార్లమెంటు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా దేశంలోని చట్టసభల సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. పాకిస్తాన్ ఆర్థిక రంగంలో పురోగమిస్తోందని, జూన్ 30తో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ 4.7 శాతం వృద్ధి సాధించిందని ఆయన అన్నారు.
పాకిస్తాన్ ఆర్థిక వృద్ధిలో చైనాతో భాగస్వామ్యం ఎంతో కీలకమయిందని పేర్కొన్నారు. ఏదేమయినా అనేక బిలియన్ డాలర్ల విలువ గల చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పూర్తవుతుందని హుస్సేన్ అన్నారు.