జాతీయ వార్తలు

4,500కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 13: గత వారం కురిసిన కుండపోత వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి రూ.4,500 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఆదివారం కోరింది. వరదల ప్రభావాన్ని స్వయంగా తెలుసుకోవడం కోసం చెన్నైలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో రాష్ట్ర సెక్రటేరియట్‌లో సమావేశమయ్యారు. వరదలకు దెబ్బతిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల, వరద నీటి డ్రైనేజ్ వ్యవస్థలకు విపరీతంగా నష్టం జరిగిన విషయాన్ని జయలలిత మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. చెన్నై కార్పొరేషన్ సహా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు వీటి పునర్నిర్మాణానికి భారీగా ఆర్థిక సహాయం అవసరమని, ఈ నష్టం ప్రాథమిక అంచనా రూ.4,500 కోట్లకు పైగానే ఉంటుందని జయలలిత కేంద్ర మంత్రికి చెప్పినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ పనులు చేపట్టడానికి స్థానిక సంస్థలు కేవలం తమ సొంత పన్నుల రాబడిపైనే ఆధారపడలేవని, అందువల్ల రూ.4,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజిని అందజేయాలని వెంకయ్యనాయుడ్ని కోరారు. నగరంలోని అడయార్, కూవమ్ నదులు, బకింగ్‌హామ్ కాలువ ఒడ్డుల వెంబడి నివసించే మురికివాడల ప్రజలు వరదల్లో తమ ఇళ్లతోపాటు సర్వస్వం కోల్పోయారని కూడా జయలలిత ఆయనకు చెప్పారు. వాళ్లంతా ప్రస్తుతం సహాయక శిబిరాల్లో ఉంటున్నారని చెప్పారు.

చెన్నైలోని వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న వెంకయ్య నాయుడు