జాతీయ వార్తలు

రామాలయంపై స్వామి చెప్పింది నమ్ముతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: వివాదాస్పద బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామిని తన హీరోగా పేర్కొన్న కేంద్ర మంత్రి ఉమాభారతి, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై స్వామి చెప్పే మాటలను నమ్ముతున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశం లేదన్న ఆమె అమిత్ షా నేతృత్వంలో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం పనులు ఈ ఏడాది చివరినాటికి ప్రారంభమవుతాయని సుబ్రహ్మణ్యం స్వామి చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా, ‘నేను స్వామిని ఎంతో గౌరవిస్తాను. ఆయన నా హీరో, ఎమర్జెన్సీ విధించినప్పుడు నాకు 15-16 ఏళ్ల వయసు. అప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి, జార్జి ఫెర్నాండెజ్ నా హీరోలు. అందువల్ల ఆయన ఏమి చెప్పినా నేను నమ్ముతాను’ అని పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉమాభారతి అన్నారు. బిజెపి అధినాయకత్వం రామాలయంపై అడిగే ప్రశ్నలను దాటవేయడమే కాకుండా రాజకీయంగా అత్యంత కీలకమైన యుపిలో అధికారం హస్తగతం చేసుకోవాలనుకుంటున్న పార్టీ ఎన్నికల నినాదం అభివృద్ధేనని పదే పదే అంటున్న తరుణంలో ఒకప్పుడు కరుడుగట్టిన హిందుత్వవాది అయిన ఉమాభారతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
గత ఏప్రిల్‌లో ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వామి మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ఈ ఏడాది చివరికల్లా ప్రారంభమవుతాయని చెప్పడం తెలిసిందే. అంతేకాదు వచ్చే ఏడాది హిందువులు రామనవమి వేడుకలను రామందిరంలోనే జరుపుకొంటారన్న విశ్వాసాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు.
రామమందిర ఉద్యమంలో ప్రధాన అంశం ఏమిటంటే అది రాముడి జన్మస్థలమా కాదా అనేదే. మధ్యలో ఉన్న గోపురం రామ్‌లల్లాకు చెందినదని అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం నిర్ద్వంద్వంగా స్పష్టం చేసింది. ఆ ప్రకటనతో రామమందిరం ఉద్యమానికి న్యాయపరమైన అనుమతి లభించింది. ఇప్పుడు మిగిలి ఉన్న వివాదం భూమికి సంబంధించిన వివాదం, అది రామజన్మభూమా కాదా అనే దానిపై ఎలాంటి వివాదమూ లేదు. భూ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఉద్యమాలు అవసరం లేదు. దాన్ని చర్చల ద్వారా లేదా చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చు. రామజన్మభూమి సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చర్చల ద్వారా సాధించుకోవచ్చని నేను భావిస్తున్నాను’ అని ఉమాభారతి అన్నారు. ఇరుపక్షాలకు చెందిన సాధువులు, మత పెద్దలు రెండు మతాలకు చెందినవారి మధ్య చర్చలు జరిగేలా చూడాలని, తాము సమస్యను పరిష్కరించుకున్నామని కోర్టుకు చెప్పాలని ఆమె అన్నారు. ‘అప్పుడు అక్కడ ఓ అద్భుతమైన ఆలయం నిర్మాణం అవుతుంది. మందిర ఉద్యమంలో నేను పాలు పంచుకున్నందుకు గర్విస్తున్నాను. అంతేకాదు నేను చేసింది సరయినదేనని కోర్టు సైతం ముద్ర వేసింది’ అని అలహాబాద్ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఉమాభారతి అన్నారు.